రాష్ట్రీయం

పేద బ్రాహ్మణులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో నివసిస్తున్న బ్రాహ్మణుల్లో 90 శాతం పైగా పేదరికంలో మగ్గుతున్నారు. అర్ధశతాబ్దకాలంలో ఆర్థికం గా, సామాజికంగా, రాజకీయం గా బాగా దెబ్బతిన్న సామాజికవర్గం ఇది. సామాజిక మార్పులకు అనుగుణంగా ఈ వర్గం అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వ చర్యలు సైతం ఈ వర్గానికి బాగా నష్టం చేశాయి. స్వాతంత్య్ర సమరంలో త్యాగం చేసినవారు, జాతికోసం ఆస్తులు అర్పించినవారిలో బ్రాహ్మణులు ముందువరసలో ఉన్నారు. స్వాతంత్య్రానంతరం రాజకీయంగా బాగా వెనుకబడ్డ జాతిగా మారింది. ఇనాం రద్దు చట్టంతో ఉన్న భూములను కోల్పో యి, ప్రభుత్వం నుండి ఆర్థికంగా చేయూత లభించకపోవడంతో ఈ వర్గం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. గ్రామాధికార వ్యవస్థ రద్దు తర్వాత ఉపాధికోల్పోయిన వర్గం పట్టణాలకు వలస పోయింది. ఉపాధికోల్పోయాక ప్రత్యామ్నాయ విధానం లేకపోవడంతో ఇక్కట్లకు గురికావలసి వచ్చింది. చదువుకునేందుకు అవకాశాలు లేని వారు అనేక కష్టాలకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ లిమిటెడ్ (ప్రభుత్వ రంగ సంస్థ) ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధా న కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధికి కృష్ణారావు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ పూర్తిపాఠం ఇలా ఉంది.
ప్రశ్న: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ (ఎబిసి) ఏర్పాటు ఉద్దేశాలు ఏమిటి?
జవాబు: రాష్ట్రంలోని బ్రాహ్మణ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకునేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల ప్రతిరూపం.
ప్ర: మధ్యదళారుల వల్ల చాలా కార్పొరేషన్లు నష్టపోయాయి.?
జ: కొత్తగా ఏర్పడ్డ ఎబిసి కార్యకలాపాల్లో దళారులకు ప్రమేయం ఉండదు. కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి.
ప్ర: ఎబిసి ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది?
జ: బ్రాహ్మణ సమాజాన్ని అన్ని కోణాల్లో ఆదుకోవడమే ప్రధాన లక్ష్యం. విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు చేయూత లభిస్తుంది.
ప్ర: ప్రభుత్వం నుండి ఆర్థికంగా ఏ విధంగా చేయూత లభిస్తోంది?
జ: 2016-17 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 65 కోట్ల రూపాయలు కేటాయించింది. 2015-16లో అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
ప్ర: విద్యార్థులకు సహాయం చేస్తున్నారా?
జ: ఇంటర్ స్థాయి నుండి ప్రొఫెషనల్ కోర్సులతో సహా పిజి స్థాయి వరకు పేద బ్రాహ్మణ విద్యార్థుల ‘్భరతి’ స్కీం పేరుతో స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నాం. విదేశాల్లో చదువుకోసం వెళ్లే వారికి 10 లక్షల రూపాయల వరకు గ్రాంటుగా ఇవ్వాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో సివిల్స్, రాష్ట్ర స్థాయిలో పిఎస్‌సి నిర్వహించి వివిధ గ్రూపుల పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ‘వశిష్ట’ పథకం పేరుతో సాయం చేస్తున్నాం.
ప్ర: నిరుద్యోగ యువతకు ఎబిసిలో ఏవైనా పథకాలున్నాయా?
జ: ఉన్నాయి. నిరుద్యోగ యువతకు వృత్తినైపుణ్యతను పెంపొందించుకునేందుకు ‘ద్రోణాచార్య’ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించాం.
ప్ర: స్వయం ఉపాధి కావాలనుకునే వారికి చేయూత ఇస్తారా?
జ: ఇస్తాం. స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ‘చా ణక్య’ పేరుతో మరో పథకాన్ని ప్రారంభించాం. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చేవారికి కూడా ఇదే పథకం కింద చేయూత ఇస్తాం.
ప్ర: ఎలాంటి ఆదరణ లేని వృద్ధులకు చేయూత ఏమైనా ఉంటుందా?
జ: తప్పనిసరిగా ఉం టుంది. ఏ ఆదరణ లేని వారు వృద్ధాశ్రమాల్లో ఉంటే వారికి అయ్యే భోజన తదితర ఖర్చు ‘కాశ్యప’ పేరుతో ఎబిసి భరిస్తుంది. ప్రభుత్వ పింఛన్ రాని వారికి నెలకు వెయ్యిరూపాయలు పింఛన్‌గా ఇస్తాం.
ప్ర: కమ్యూనిటీ అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతారా?
జ: మ్యారేజ్‌హాళ్ల నిర్మాణం తదితర సామూహిక నిర్మాణాలను చేపడితే యాభై శాతం ఆ యా గ్రామాలు/పట్టణాల బ్రాహ్మణులు భరిస్తే మిగతా యాభై శాతం ఎబిసి ఇస్తుంది.
ప్ర: ఎవరైనా వ్యక్తులు సామూహిక కార్యక్రమాల్లోభాగస్వాములు అయ్యేందుకు ముందుకు వస్తే?
జ: అలాంటి వారి సాయం తీసుకుంటాం. ఇందుకోసం ‘అక్షయ బ్రాహ్మణ నిధి’ పేరుతో ఒక పథకాన్ని, ‘శ్రీకృష్ణ సుధామ’ ఎండోమెంట్ పేరుతో మరో పథకాన్ని ప్రారంభించాం.
ప్ర: ఎబిసిలో ఎవరిని సంప్రదించాలి?
జ: వివరాలు కావాలనుకునే వారు వెబ్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఆంధ్రాబ్రాహ్మిణ్.ఎపి.జిఓవి.ఇన్) ద్వారా లేదా 040-2476 7879/9100 959 611) ఫోన్‌ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.