రాష్ట్రీయం

పెరిగిన ఓటు.. ఎవరికి చేటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే గణనీయంగా పెరగడం దేనికి సంకేతం?. అధికార పార్టీ ప్రభంజనానికా? ప్రతిపక్ష కూటమి విజయానికా? అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి గద్దె నెక్కించడానికి వీచిన ప్రభంజనంగా భారీ పోలింగ్‌ను పాలకపక్షం అంచనా వేస్తోంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకతతో తమకు అనుకూలంగా పోటెత్తిన ఓట్లుగా దీన్ని ప్రజాకూటమి భావిస్తోంది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం అన్న చిక్కుముడిపై రాజకీయ వర్గాలు, విశే్లషకులు, ప్రజల్లో ఎక్కడ చూసినా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాము చేపట్టన సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల ప్రజల నుంచి వ్యక్తమైన పాజిటివ్ ఓటుగా టీఆర్‌ఎస్ వర్గాలు దీన్ని విశే్లషిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా ప్రజాకూటమి వర్గాలు దీన్ని అన్వయించుకుంటున్నాయి. పార్టీల మాట ఎలా ఉన్నా..నిపుణులు మాత్రం ఇందుకు భిన్నమైన వాదనలే వినిపిస్తున్నారు. ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకంగా చెప్పలేమని, ప్రభుత్వానికి అనుకూలం కూడా కావచ్చని ఎన్నికల ట్రెండ్స్, ఎగ్జిట్ పోల్స్‌పై సర్వే నిర్వహించే సంస్థల నిపుణులు అంటున్నారు. ఓటింగ్ శాతం పెరగడం వల్ల తమ అంచనా మేరకు వంద సీట్లు గెలవడం ఖాయమని మంత్రి కేటీఆర్ విశే్లషించగా, తాము ముందు నుంచి అంచనా వేసినట్టుగా 80 స్థానాల్లో ప్రజాకూటమి విజయానికి సంకేతంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటింగ్ శాతం పెరగడం పట్ల పాలక, ప్రతిపక్ష పార్టీలో గెలుపు ధీమాను పెంచినప్పటికీ ఎవరి అంచనాలు ఫలించేది? లేనిది మరో 24 గంటల్లో తేలిపోనుంది. టీఆర్‌ఎస్ పార్టీ అంచనాలకు ప్రధానంగా
మూడు కారణాలు విశే్లషిస్తోంది. తమకు గట్టి బలమున్న గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరగడం, అలాగే మహిళా ఓటర్లు కూటమికంటే తమకే మొగ్గు చూపడం, ప్రజాకూటమికి అనుకూలంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడం తమకు కలిసొచ్చే అంశంగా చెబుతోంది. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా ప్రజాకూటమి లెక్కలేసుకుంటోంది. డబుల్ రూమ్ ఇళ్ల హామీ పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలను ప్రభావితం చేసిందని, అయితే ఎక్కడా ఈ పథకం క్షేత్రస్థాయిలో గ్రౌండ్ కాకపోవడం పట్ల గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది. అలాగే ఇంటింటికి మంచినీరు ఇచ్చే మిషన్ భగీరథ, దళితులకు ఉచితంగా మూడు ఎకరాల హామీలను నిలబెట్టుకోకపోవడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాలు జరగకపోవడం, కనీసం డీఎస్సీ నిర్వహించలేకపోవడం తదితర ప్రధాన అంశాలు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలను ఎక్కువగా ప్రభావితం చేశాయనీ, ఈ కారణాల వల్ల ప్రభుత్వ వ్యతిరేక పవనాలు తమకు అనుకూలంగా మారాయని ప్రజాకూటమి నేతలు విశే్లషిస్తున్నారు. ఎన్నికల విశే్లషకులు, రాజకీయ, మేధావి వర్గాలు మాత్రం ఓటింగ్ శాతం పెరగడం పాలకపక్షం టీఆర్‌ఎస్‌కుగానీ, ప్రజాకూటమికి కానీ ఏదో ఒక పార్టీ వైపు ప్రజల మొగ్గుకు కారణం అయి ఉండవచ్చని చెబుతున్నాయి.