రాష్ట్రీయం

సిబిఐ విచారణ చేయంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: అగ్రిగోల్డ్ సంస్థ కార్యక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సిబిఐ చేత విచారణ చేయించాలని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై సోమవారం జరిగిన చర్చలో పాల్గొంటూ, దాదాపు40 లక్షల మంది 6850 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేశారని, వీటిపై వడ్డీతో కలిపి మొత్తం 10 వేల కోట్ల రూపాయలు అవుతుందన్నారు. అగ్రిగోల్డ్ సంస్థతో పాటు ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న విత్తన, పాల ఉత్పత్తి, విద్యుదుత్పత్తి, హోటళ్లు, టూరిజం సంస్థలు, రిసార్టులు, వైద్యం తదితర పేర్లతో సుమారు 155 గ్రూప్ కంపెనీలు ఉన్నాయని, వీటికి ఆస్తులు ఎన్ని ఉన్నాయో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. హైకోర్టు నేతృత్వంలో ఆస్తులను వేలం వేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వివరించారు.
వాస్తవంగా 1998 మార్చి 31న ‘సెబీ’ అగ్రిగోల్డ్ కంపెనీపై ప్రభుత్వాన్ని హెచ్చరించిందని, ప్రజల నుండి నిధులు సేకరించకుండా చూడాలని స్పష్టంగా ప్రభుత్వానికి తెలియచేసిందని జగన్ గుర్తు చేశారు. 2004 వరకు అధికారంలో టిడిపి కొనసాగినప్పటికీ ఈ కంపెనీపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. ఆనాడే ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుని ఉంటే ప్రజలు నష్టపోయేవారు కాదన్నారు. ఈ కంపెనీకి ఎనిమిది లక్షల మంది ఏజంట్లు ఉన్నారని, కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల ఏజంట్లపై వత్తిడి పెరగడంతో వందమంది ఏజంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కంపెనీ తప్పు చేయడం వల్ల గ్రామాల్లో ఉండే ఏజంట్లు సొంత గ్రామాలను వదిలి వలసవెళ్లారన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసిన చంద్రబాబు, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ చేత విచారణ చేయించకుండా సిఐడి చేత విచారణ చేయిస్తున్నారని, సిఐడి కేవలం అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇచ్చే సమాచారం పైనే ఆధారపడిందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల జాబితాను సిబిఐ ఇటీవల హైకోర్టుకు అందచేసిందని, అందులో అన్ని ఆస్తుల గురించి తెలియచేయలేదని జగన్ పేర్కొన్నారు.
సిబిఐ విచారణ చేయిస్తే మరింత జాప్యం జరుగుతుందని, ఇప్పటికే సిఐడి విచారణ చేయించామని ప్రభుత్వం తరఫున మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సిఐడి విచారణతో హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని, హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను ఏప్రిల్-మేనెలల్లో వేలం వేస్తున్నామని, బాధితులకు న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అందువల్ల బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.