రాష్ట్రీయం

ఆనాటి అద్భుతానికి 63 వసంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, డిసెంబర్ 9: రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ, ఆధునిక దేవాలయమైన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఈరోజుతో 63వసంతాలు పూర్తయ్యాయి. పూర్తయి 64వ వసంతంలో అడుగుపెట్టింది. 1955 డిసెంబర్ 10న అప్పటి మన ప్రధాని పండిత్ జవహర్‌లాల్‌నెహ్రు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన చేశారు. మానవ మేధోవికాసానికి ప్రతీకగా నిలిచి మన దేశ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి కీర్తిచంద్రికగా శ్రమశక్తిని ఋజువు చేసిన కరదీపిక నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. ఇరు రాష్ట్రాలను అన్నపూర్ణగా పచ్చదనంతో సింగారించి తెలుగు మాగానిగా తీర్చిదిద్దిన అద్భుత మహాకట్టడం సాగర్ సౌదం, కరువురక్కసి కబంధహస్తాల నుండి రైతులకు విముక్తి కల్పించిన పవిత్ర మందిరం నాగార్జునసాగర్. భారతదేశ ఇంజనీర్ల ప్రతిభకు, ప్రజల శ్రమశక్తికి సాగర్ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలిచింది. సాగర్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన చేస్తు నేడు నాగార్జునసాగర్ నేను ఇక్కడ జరిపే శంకుస్ధాపన కార్యక్రమాన్ని పవిత్ర కార్యంగా పరిగణిస్తున్నాను, ఇది భారత ప్రజా సౌభాగ్యమందిరానికే శంకుస్ధాపన సహేతు హిమచల పర్వంతం నిర్మించుకుంటున్న నవదేవాలయానికి ఇది చిహ్నమని జవహార్‌నెహ్రు వాఖ్యనించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అంకురార్పన ఆరున్నర దశాబ్ధాల క్రితమే రైతులు కరువుతో విలవిలలాడుతున్న సమయంలో ముక్త్యాల రాజైన రాజారామగోపాలకృష్ణా మహేశ్వరప్రసాద్ అనుకున్నదే తడవుగా ప్రస్తుతం పులిచింతల వద్ద కృష్ణనదికి అడ్డుకట్ట వేస్తు ప్రాజెక్ట్ కట్టాలని అంకురార్పన జరిగింది. కొన్ని అనివార్యకారణాల వలన ఈ నిర్మాణం జరగలేదు. అయిన కూడ పట్టువదలకుండా కెఎల్ రావు, వావిలాల గోపాలకృష్ణయ్య, కొంతమంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సహకారంతో సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నం ఒక దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను మద్రాస్ రాష్ట్రం వ్యతిరేఖిస్తుండంతో చల్లపల్లి రాధశివప్రసాద్ అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసి సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ అవశ్యకతపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన టెలిగ్రామ్స్‌తో ప్రభుత్వ కార్యలయమంత నిండిపోయింది. వి.గోపాలకృష్ణయ్య డిల్లీ వెళ్లి ప్లానింగ్ కమీషన్ మంత్రి గుల్జారి లాల్‌నందాను కలిసి సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కోస్లాకమిటీ ఏర్పాటు అయ్యేలా కృషి చేశారు. వీరి ఫలితంగా 1955డిసెంబర్ 10న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు పునాదిరాయి పడింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పునాది 44అడుగులు కాగా అక్కడి నుండి 408 అడుగుల ఎత్తు వరకు సాగర్ ప్రాజెక్ట్ నిర్మించారు. అడుగు భాగంలో 287.9 అడుగుల నుంచి 300ల అడుగుల వెడల్పుగా రానురాను పైభాగం 30.5 అడుగుల వెడల్పుతో నిర్మించారు. 4,756 అడుగుల రాతికట్టడాన్ని 79బ్లాకులుగా నిర్మించారు. దీనిలో నాన్‌ఓవర్‌ప్లో విభాగాల మధ్య 26 క్రస్ట్ గేట్లను జలాశయ మట్టం 546అడుగులస్ధాయిలో అమర్చారు. ప్రపంచంలోనే రాతి ఆనకట్టల్లో సాగర్ ప్రాజెక్ట్ ప్రధమస్ధానంలో ఉంది. స్వదేశీ ఇంజనీర్ల ప్రతిభ పాఠవాలతో నిర్మించిన మొట్టమొదటి ఆనకట్ట నాగార్జునసాగర్ రోజుకు 40వేలమంది కార్మికులు, 5వేలమంది ఇంజనీర్లు సుమారు 12సంవత్సరాలు శ్రమఓర్చి కష్టపడితే నాగార్జునసాగర్ రూపకల్పన జరిగింది. సాగర్‌ను బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌గా నిర్మించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో 23లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తు ఇరురాష్ట్రాల దాహర్తిని తీరుస్తు 960మెగావాట్ల విద్యుత్ కాంతులను వెదజల్లుతు సాగర్ ప్రాజెక్ట్ నేటికి అంతర్జాతీయస్ధాయిలో గుర్తింపు పొందుతునే ఉంది. ఇటువంటి ప్రాజెక్ట్ ప్రస్తుతం జలవివాదాల కారణంగా రాష్ట్రాల మధ్యన జవయుద్ధాలకు కారణమవ్వడం సోచనీయం. రెండురాష్ట్రాలకు అన్నంపెడుతున్న ఇటువంటి మహంతర కట్టడంపై ఉగ్రవాదుల దృష్టిపడడం విచారకరం. ఇటువంటి కట్టడాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.

చిత్రాలు.. సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్న నెహ్రు

*రాళ్లను మోసుకెళ్తున్న కూలీలు