రాష్ట్రీయం

లక్ష్యం.. 150 పనిదినాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కరవు ప్రాంతాల్లో ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో 150 రోజుల పనిదినాల లక్ష్యం చేరుకోవాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగి ప్రజలకు మేలు జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సోమవారం నీరు- ప్రగతి, వ్యవసాయం -పురోగతిపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరికల్లా స్వచ్ఛ సంక్రాంతిగా అన్ని గ్రామాలను తీర్చి దిద్దాలని నిర్దేశించారు. గ్రామాల్లో చెత్త కనిపించరాదన్నారు. వీధి దీపాలన్నీ ఎల్‌ఈడీగా మార్పుచేయాలని, ఉబరైజేషన్ ఏర్పాట్లు శరవేగంతో పూర్తిచేయాలని ఆదేశించారు. ఇళ్ల నుంచి చెత్తసేకరణ, వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ పనులు ముమ్మరం చేయాలన్నారు. పట్టణాల నుంచి పల్లెలకు పండుగకు వచ్చిన వారు ఆశ్చర్యపోయేలా గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. పరిశుభ్రతకు రాష్ట్రం నెలవు కావాలని అభిలషించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, వ్యవసాయ అనుబంధరంగాలు, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులు రాజశేఖర్, గోపాలకృష్ణ, ద్వివేది, చిరంజీవి చౌదరి, జవహర్‌రెడ్డి, రియల్‌టైమ్ గవర్నెన్స్ ఎండీ అహ్మద్‌బాబు, ఇస్రో రాజశేఖర్, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరైన టెలీకాన్పరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది తొలి 6 నెలలు వృద్ధిరేట్లు ప్రకటించాం.. లోటు వర్షపాతంలో కూడా వృద్ధిరేటు తగ్గకుండా చూశామన్నారు. ఈ ఏడాది
వ్యవసాయం, అనుబంధరంగాల లక్ష్యం 22.14 శాతం కాగ9, తొలి అర్థ సంవత్సరంలో 17.18శాతం సాధించామన్నారు. జాతీయ వృద్ధిరేటు కన్నా నాలుగు రెట్లు ముందున్నామని తెలిపారు. ప్రతి ఏటా రాష్ట్ర ఆదాయం పెరగాలన్నారు. అన్నివర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆశించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సమీకరించాలన్నారు. అధికార యంత్రాంగం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గతేడాది జీఎస్‌డీపీలో ఏపీ అప్పుల వాటాను 10 శాతానికి తగ్గించ గలిగామన్నారు. అన్ని సమీక్షల తరువాత ప్రతిశాఖలో కచ్చితత్వం రావాలని నిర్దేశించారు. విజన్, ఇంప్లిమెంటేషన్‌లో ఇంకా సమస్యలు తలెత్తరాదని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో అంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. నాలుగేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేశామని చెప్పారు. ఉద్యానవనరంగ వృద్ధి లక్ష్యం 20.24కు గాను 15.93 సాధించామని, పశుసంవర్థక విభాగంలో 19.87కు గాను 15.34, ఆక్వాలో 26.60కు గాను 22.36 శాతం సాధించామని వివరించారు. మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు లక్ష్యం 22శాతానికి చేరుకోవాలని పునరుద్ఘాటించారు. ఏ రంగంలో మరింత అభివృద్ధికి అవకాశం ఉందో గుర్తించాలన్నారు. అప్రతి ఏటా 15 శాతం సగటు వృద్ధి సాధించాలని సూచించారు. విజన్, ఇన్నోవేషన్, అకౌంటబిలిటీ, డిజిటలైజేషన్, ఊబరైజేషన్, కన్వర్జన్స్, టెక్నాలజీ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ‘వయాడక్ట్’ ఒక అభివృద్ధి మంత్రంగా మారాలన్నారు. రబీలో పంటల దిగుబడులు తగ్గకుండా చూడాలన్నారు. ఖరీఫ్‌లో 95 శాతం పంట రుణాలివ్వగా రబీలో ఇప్పటివరకు 46 శాతం మాత్రమే అందించారన్నారు. మిగిలిన వారికి కూడా పంట రుణాలు వేగవంతం కావాలన్నారు. 10,46,420 మంది కౌలు రైతులకు రూ 4621 కోట్ల రుణాలు అందించటం దేశంలోనే చరిత్ర అన్నారు. ఇదే స్ఫూర్తితో రైతులకు పెట్టుబడులకు ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. ఈ-క్రాప్ నమోదుపై దృష్టి సారించాలన్నారు. సకాలంలో స్పందించటం వల్ల జొన్న, మొక్కజొన్నపై కత్తెర పురుగు బెడదను నియంత్రించామని ఇది చెరకు పంటపై విస్తరించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంత త్వరగా దీన్ని గుర్తిస్తే అంత త్వరగా నియంత్రించగలమన్నారు. ఫాల్ ఆర్మ్ వార్మ్‌పై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. కృషికళ్యాణ్ అభియాన్-2లో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో విశాఖ 3వ స్థానం, కడప 15వ స్థానంలో ఉందన్నారు. ఈ ఖరీఫ్‌లో కరవు కారణంగా దెబ్బతిన్న పంటలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ పరిశీలించిందని, కేంద్రం నుంచి రూ 1869 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ వెంటనే మంజూరయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ఆక్వా అభివృద్ధి విస్తృతం కావాలన్నారు. కృష్ణా, గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆక్వా ఆదాయం సంతృప్తికరంగా ఉందని, ప్రకాశం జిల్లా కూడా అదే స్థాయికి చేరుకోవాలని సూచించారు. గుకులాలు, మినీ గోకులాలకు భారీగా డిమాండ్ ఉందన్నారు. 273 గోకులాలు, 9940 మినీ గోకులాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో డిమాండ్ దృష్ట్యా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు 83, 075 ఎకరాల్లో మంజూరు కాగా 53, 870 ఎకరాల్లో పురోగతిలో ఉందన్నారు. మిగిలింది వెంటనే ప్రారంభించాలన్నారు. ఇప్పటి వరకు 1,23,795 మెట్రిక్ టన్నుల సైలేజ్ పంపిణీ చేశారని, లక్ష్యంలో మిగిలింది కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాలదిగుబడి తగ్గకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. గోదావరి-పెన్నా అనుసంధానం పూర్తయితే నీటి సమస్య ఉండదని చెప్తూ నీరు-ప్రగతిలో సత్ఫలితాలను సాధించామన్నారు. రూ 10వేల కోట్ల నరేగా నిధులను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రూ 6400 కోట్లు ఖర్చయ్యాయని, మిగిలిన 3600 కోట్ల లక్ష్యం 3నెలల్లో పూర్తికావాలన్నారు. ఈ వారం 154 కోట్లు వినియోగించు కున్నామని దీన్ని 240 కోట్లకు పెంచాలన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, ప్రహరీగోడలు, సోక్‌పిట్స్ పనులు వేగవంతం చేయాలన్నారు.