రాష్ట్రీయం

మేమంతా ఒక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రజాకూటమి తరఫున గెలిచే అభ్యర్థులందరినీ ఒకే పక్షంగా పరిగణించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు కూటమి నేతల బృందం సూచించింది. ఎన్నికలకు ముందు జతకట్టిన పక్షాన్ని మాత్రమే గుర్తించాలి తప్ప ఫలితాల వెలువడ్డ తర్వాత కలిసే పార్టీలను పరిగణనలోకి తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కితో కూడిన బృందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుసరించే విధానంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, సర్కారియా కమిషన్ సిఫార్సులను కూటమి నేతలు వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమితో జతకట్టిన రాజకీయ పక్షాలు, ఉమ్మడి ప్రణాళికను ఎన్నికలకు ముందే ఈసీకి సమర్పించిన ప్రతులను గవర్నర్‌కు అందజేశారు. ఏ పార్టీకి స్పష్టమైన మేజారిటీ రానిపక్షంలో ఎన్నికలకు ముందు జతకట్టిన పార్టీలను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటుకు పరిగణనలోకి తీసుకోవాలి బృందం అభ్యర్థించింది. అంతే తప్ప ఫలితాల తర్వాత జతకట్టే పార్టీలను పరిగణనలోకి తీసుకోరాదని వారు స్పష్టం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రతులతో పాటు ఇదే అంశంలో సర్కారీయా కమిషన్ సిఫార్సులను కూటమి నేతలు వివరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని గవర్నర్‌కు గుర్తుచేయడానికే కలిసినట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వివరించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు రోజున కూటమి
పక్షాల నేతలు గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంటుందో లేదోనని ముందు జాగ్రత్తగా ఒక రోజు ముందు భేటీ అయ్యామని అన్నారు. గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లు కూడా తమతో టచ్‌లో ఉన్నారని ఉత్తమ్ వెల్లడించారు. వారి మద్దతు కూడా తమకే ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ, శాసనసభను రద్దు చేసిన రోజుననే రాష్టప్రతి పాలన విధించి ఎన్నికలు జరిపించాలని తాము కోరామన్నారు. తమ విజ్ఞప్తిని గవర్నర్ పట్టించుకోకపోవడం వల్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ ఏర్పాటులో పునరావృతం కాకూడదని, కీడెంచి మేలు ఎంచాలనే ఉద్దేశంతోనే నరసింహన్‌ను కలిశామన్నారు. తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ మాట్లాడుతూ, కూటమి తరఫున గెలిచే అభ్యర్థులు అందరినీ ఒకే సమూహంగా చూడాలని గవర్నర్‌ను కోరామన్నారు. గవర్నర్‌ను కలిసిన బృందంలో ఇంకా కాంగ్రెస్ సీనియర్ నేతలు కే జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, అజాహరుద్ధీన్, జెట్టి కుసుమ కుమార్, పార్టీ లీగల్ సెల్ నాయకుడు, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తదితరులు ఉన్నారు.
చిత్రం..రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసిన
ప్రజాకూటమి నేతలు ఉత్తమ్, రమణ, కోదండరాం, పొన్నాల తదితరులు