రాష్ట్రీయం

మళ్లీ కేసీఆరే సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ఎన్నికల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ప్రజలు మరోసారి దీవించారని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. సోమవారం అసద్ ఒంటరిగా బుల్లెట్‌పై ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రగతి భవన్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు వెళతానని అసద్ ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొనడంతో మీడియా ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఎదురు చూడసాగారు. అయితే అసద్ బుల్లెట్‌పై హెల్మెట్ పెట్టుకుని వెళ్ళడంతో మీడియా ప్రతినిధులు గమనించలేదు. ప్రగతి భవన్‌లో కేసీఆర్, అసద్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడితే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. న్యాయకోవిదులు ఏమంటున్నారు? గతంలో వివిధ రాష్ట్రాల్లో, కేంద్రంలో హంగ్ ఏర్పడితే ఎటువంటి చర్యలు తీసుకున్నారు? తదితర అంశాలపై చర్చించారు.
సమావేశానంతరం అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సంపూర్ణమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను అల్లాను కోరానని ఆయన తెలిపారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే తాము టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తామని ఆయన చెప్పారు. హంగ్ రాదని, ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారని ఆయన తెలిపారు. కేసీఆర్‌ను ప్రజలు మరోసారి దీవించారని ఆయన అన్నారు. తమ పార్టీ పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లో సునాయాసంగా గెలుపొందుతామని ఆయన ధీమాగా అన్నారు. తాము ప్రధానంగా జాతీయ రాజకీయాలపైనే చర్చించామని అసద్ తెలిపారు.

చిత్రం..కేసీఆర్‌తో చర్చించేందుకు బుల్లెట్‌పై ఒంటరిగా ప్రగతిభవన్‌కు వస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ