రాష్ట్రీయం

సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై సిరుల తల్లి విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపైన, రాత్రి చంద్రప్రభ వాహనంపైన ఊరేగుతూ సిరుల తల్లి పద్మావతి దేవీ భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై అమ్మవారు త్రివిక్రమ అలంకారంలో శ్రీ మహావిష్ణువు రూపంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులను సన్మార్గంలో నడిపించేందుకు త్రివిక్రమ అవతారంలో అనుగ్రహించిన అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. బలి చక్రవర్తిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వామనావతారాన్ని ఎత్తారు. ఈ వామనుడినే త్రివిక్రముడని అంటారు. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీ మన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్య నారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మధ్యాహ్నం 12.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు ఊజంల్ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై తెల్లటి వస్త్రాలతో అలమేలుమంగను దర్శించుకున్న భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈఓ పోలా భాస్కర్, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, విజీఓ అశోక్‌కుమార్ గౌడ్, ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..తిరుచానూరు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న సిరుల తల్లి శ్రీ పద్మావతీ అమ్మవారు