రాష్ట్రీయం

గోదావరి డెల్టాల్లో ఊపందుకున్న రబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 10: గోదావరి డెల్టాల్లో రబీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ 15 కల్లా రబీ నాట్లు పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే ఈ నెలాఖరుకు గానీ అన్ని చోట్లా నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం కొన్ని చోట్ల నారుమడులు వేస్తుంటే, మరి కొన్నిచోట్ల నాట్లు, ఇంకొన్ని చోట్ల దుక్కులు దునే్న పరిస్థితి కన్పిస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో నాట్లు జోరందుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 15 నాటికి నాట్లు పూర్తిచేయడానికి వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. గోదావరి జిల్లాలో రబీ మొత్తం సుమారు 8.96 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఈ సీజన్ నుంచి కొత్తగా రెండు వరి వంగడాలను ప్రవేశ పెట్టారు. గత రెండు మూడేళ్లుగా ప్రయోగాత్మక దశలో వున్న ఈ రెండు రకాలను ఈ సీజన్ నుంచే తొలిగా గుర్తింపు విత్తనంగా అందుబాటులోకి తెచ్చారు. స్వల్పకాలిక రకాలుగా 120 రోజుల పంట కాలానికి దిగుబడి వచ్చే వార్షికంగా వేసే రకాలైన ఎంటీయు 1010, ఎంటీయు 1001, ఐ ఆర్ 64, బీపీటి 5204 రకాలను రైతులు సాగు చేస్తున్నారు. దీంతో పాటు ఈ సీజన్ నుంచి ఎంటీయు 1156, 1126 రకాలను కొత్తగా ప్రవేశ పెట్టారు. డిసెంబర్ పదిహేనుకల్లా నాట్లు పూర్తయితే ఏప్రిల్ చివరి నాటికి పంట చేతి కొచ్చే విధంగా నిర్ధేశించారు. కేవలం 120 రోజుల్లో అత్యధిక దిగుబడి సాధించే విధంగా రబీ కార్యాచరణకు దిగారు. డెల్టాల్లో సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం నీటి అవసరాలకు సరిపడేవిధంగా ఉన్నాయని జల వనరులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు పేర్కొంటున్నాయి. గోదావరి జిల్లాల్లో మెట్ట, మైదాన ప్రాంతాల్లో బోర్ల కింద, డెల్టాల్లో సాగునీటి కాల్వల వ్యవస్థ ద్వారా రబీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఖరీఫ్‌లో సరాసరి దిగుబడి 33 బస్తాలు వచ్చింది. అయితే రబీ గ్యారంటీ పంట కాబట్టి కనీసం 40 నుంచి 50 బస్తాల దిగుబడి లక్ష్యాన్ని అంచనావేస్తున్నారు. 120 రోజుల రబీ పంట కాలంలో సూర్యరశ్మి, వెలుతురు సవ్యంగా వుంటుంది కాబట్టి ఎటువంటి చీడపీడలకు తావులేకుండా దిగుబడి ఆశాజనకంగా వచ్చి అత్యధిక దిగుబడి సాధించవచ్చని అంచనావేశారు. తక్కువ వ్యవధిలో పంట చేతికందే రకాలను వ్యవసాయ శాఖ సూచిస్తుండగా రైతులు మాత్రం అధిక దిగుబడినిచ్చే బొండాలు రకం సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవసాయ, జల వనరుల శాఖలు రబీ నీటి అవసరాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నీటి వనరులను అంచనా వేశారు. దాదాపు 97 టిఎంసీల నీటితో గోదావరి డెల్టాల నీటి అవసరాలు తీర్చి రబీని గట్టెక్కించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఏటిపట్టు గ్రామాలు సీతానగరం, రాజమహేంద్రవరం రూరల్, కోరుకొండ, కోనసీమ ప్రాంతాల్లో నాట్లు పూర్తయ్యాయి. మెట్ట ప్రాంతం లో ప్రధానంగా దమ్ములు పూర్తయిన తర్వాత వెనువెంటనే బెంగాలీ కూలీల చేత నాట్లు వేయించేందు కు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. వరి కోత యం త్రాలతో ఖరీఫ్ కోతలు పూర్తయిన వెంటనే కళ్లాల్లో నే ధాన్యాన్ని అమ్ముకుని, వెంటనే దుక్కులు పూర్తిచేసుకుని నాట్లు వేసే ప్రక్రియకు రైతులు నవంబర్ చి వరి వారం నుంచే శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ నాటికి రబీ పూర్తయితే వెంటనే సాగునీటి కాల్వలకు నీటిని నిలుపుదల చేసి ఈ ఏడాది నిర్ధేశిత డెల్టా ఆధునీకీకరణ పనులు పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ మేరకు ఏప్రిల్, మే నెలల్లో డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టే విధంగా ఆలోచన చేస్తున్నారు.