రాష్ట్రీయం

‘కూటమి నేతలకు ఓటమి భయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయనే నానుడి ఉందని, అది కాంగ్రెస్ విషయంలో నిజం కాబోతోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు అన్నారు. కాంగ్రెస్ చేసిన అనాలోచిత నిర్ణయం కారణంగా అభివృద్ధిపై జరగాల్సిన చర్చ, ఆంధ్రా- తెలంగాణ సెంటిమెంట్‌పై జరిగిందని అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మళ్లీ అమరావతికి సర్దుకోవల్సిన రోజు వచ్చేసిందని అన్నారు. ఫలితాలు కాంగ్రెస్, టీడీపీలకు చెంపపెట్టులా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి గడ్డం గీసుకునే యోగం లేదని, కొందరు కాంగ్రెస్ నేతలకు డబుల్ డిజిట్ ఓట్లు కూడా రావని అన్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేది లేదని, తాము ఆ పార్టీకి వ్యతిరేకమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైతే టీఆర్‌ఎస్‌పై పోరాడింది తామేనని అన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా ఆహ్వానిస్తామని, ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ముందుగానే గవర్నర్‌ను కలిశారని ఆరోపించారు. తాము పక్క రాష్ట్ర సీఎంను నెత్తిన పెట్టుకుని తిరగలేదని, చంద్రబాబు అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నారు. ఓ వ్యక్తికీ, శక్తికీ వ్యతిరేకంగా నేతలంతా ఢిల్లీలో సమావేశం అవుతున్నారని చెప్పారు. అధికారం కోసమే వారంతా కూటమి కడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మతిస్థిమితం తప్పినట్టు కనిపిస్తున్నారని, లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందని చెప్పినట్టు ప్రచారం జరుగుతోందని కాని అది నిజం కాదని అన్నారు.