రాష్ట్రీయం

కాళోజీ వర్శిటీ నుంచే మెడికల్ కౌన్సిలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: ఈ ఏడాది నుంచి కాళోజి వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోనే మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించబోతున్నట్టు వైద్య, ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి వెల్లడించారు. శాసనసభలో వైద్యరంగానికి చెందిన పద్దులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయంలో పూర్తి స్థాయిలో పని చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వైద్యవిద్యలో ప్రవేశాలన్నీ ఇకనుంచి దానిద్వారానే నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా 250 మెడికల్ సీట్ల, 70 పీజీ సీట్లు పెరిగాయని, అలాగే 13 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు అనుమతి లభించినట్టు మంత్రి వివరించారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రులలో ఐసియు విభాగాలను ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అత్యవసర సేవలు అందిస్తున్న 108 వాహనాల మాదిరిగా త్వరలోనే ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన వారిని ఇళ్లకు చేర్చడం కోసం 102 వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రసవానికి ముందు ఆస్పత్రికి రావడానికి కూడా ఈ వాహనాలను గర్భిణీలు ఉపయోగించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు అధ్వాన్నస్థితిలో ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరిస్తూ, గత ప్రభుత్వాలు సర్కారీ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించినట్టు చెప్పారు. వచ్చే శాసనసభ సమావేశాల నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలన్నీ మారిపోతాయని మంత్రి హామీ ఇచ్చారు. ఆస్పత్రుల్లో పారిశుద్థ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో దానికోసం రూ. 171 కోట్లు కేటాయించామన్నారు. ఆస్పత్రుల భవనాల రిపేర్ల కోసం రూ.521 కోట్లు, పరికరాల కొనుగోలుకు రూ. 600 కోట్లు, వైద్య పరీక్షల కేంద్రాల కోసం రూ. 315 కోట్లు, మందుల కొనుగోలు కోసం రూ. 220 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు మంత్రి చెప్పారు. బీబీనగర్‌లో ఏర్పాటు చేసిన నిమ్స్‌లో ఓపి విభాగం ప్రారంభమైందని, త్వరలోనే ఇన్ పేషంట్స్ విభాగం ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో అవయవ మార్పిడిలు జరుగుతున్నాయని, ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఉస్మానియా ఆస్పత్రుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినట్టు మంత్రి గుర్తు చేశారు. రాష్టవ్య్రాప్తంగా మెడికల్, టీచింగ్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న మెడికల్, పారా మెడికల్ పోస్టులన్నింటినీ త్వరలో భర్తీ చేయబోతున్నట్టు మంత్రి చెప్పారు. అయితే ఈ పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా నియామకాలు జరపాలా? జిల్లా స్థాయిలో భర్తీ చేయాలా? అనే అనే అంశంపై చర్చిస్తున్నట్టు మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.