రాష్ట్రీయం

త్వరలో 3155 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 12: రాష్ట్రంలో త్వరలో 3155 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గతంలో ఆరువేల పోస్టులు భర్తీచేశామని, తాజాగా 3155 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని సర్పవరంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ పోలీసు స్టేషన్‌ను బుధవారం హోం మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పోలీసు కానిస్టేబుళ్లకు నిర్ణీత కాలవ్యవధిలో తప్పనిసరిగా పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ చదివిన వారు పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికవుతున్నందున వారికి సాంకేతిక విభాగంలో ప్రత్యేక శిక్షణనిచ్చి, నేర నియంత్రణలో వారి సేవలను ఉపయోగించుకుంటామన్నారు. ఇటీవలికాలంలో డబ్బు సంపాదనకు హైటెక్ నేరాలకు పాల్పడుతున్నారని, వాటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అరికడతామన్నారు. డీజీపీ కార్యాలయంతోపాటు రాష్టవ్య్రాప్తంగా 73మోడల్ పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నామని హోం మంత్రి తెలిపా. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వౌలిక సదుపాయల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసు శాఖకు ఫర్నిచర్,
కొత్తవాహనాలు, ఇతర వౌళిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
భూకబ్జాలు తదితర నేరాలను తగ్గించడానికి పోలీస్ వ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 22వ తేదీన ప్రారంభిస్తారని ప్రకటించారు.
కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ వ్యవస్థ ద్వారా మంచి సేవలు అందించడానికి కృషిచేస్తామన్నారు. పోలీసు సిబ్బందికి సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తామని, దీనికి అవసరమైన చర్యలుతీసుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నారు. కార్యక్రమంలో శాసన మండలి ఇన్‌ఛార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ మేయర్ సుంకర పావని, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, ఏలూరు రేంజి డీఐజీ రవికుమార్‌మూర్తి, జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్, డీఎస్పీలు రవివర్మ, విజయరావు, మున్సిపల్ కమిషనర్ కె రమేష్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..సర్పవరం మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప