రాష్ట్రీయం

దేశవ్యాప్తంగా రైతుబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫ్రంట్ అధికారంలోకి వస్తే దేశంలోని రైతులందరికీ ‘రైతు బంధు’ పథకాన్ని అమలు చేస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ విషయంలో తాను స్పష్టతతో ఉన్నానని, అమలుకు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తనను శాసనసభాపక్షం నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న ఫ్రంట్‌కు నామకరణం చేశారా? అని ప్రశ్నించగా, ఇంకా పేరు పెట్టలేదన్నారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ఫ్రంట్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తింపజేస్తామని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఏ రాష్టమ్రూ తెలంగాణకు దరిదాపుల్లో లేదన్నారు. రూ.70 వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తికానున్నాయని ఆయన తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను స్వయంగా పరిశీలిస్తానని, ఇందుకు హెలికాప్టర్‌లో వెళ్ళేప్పుడు మిమ్మల్ని వెంట తీసుకెళతానని ఆయన విలేఖరులనుద్దేశించి అన్నారు. అప్పులు చేసినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, అయితే తాము పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. ఏడాదిన్నరలో సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యోగ నియమాకాల గురించి నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి గురించి ప్రశ్నించగా, తమ కంటే ముందు 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ఆయన ఆ విలేఖరిని ఎదురు ప్రశ్నించారు. నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అబద్ధాలతో నిరుద్యోగులను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో, వాటన్నింటినీ భర్తీ చేస్తామని, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. సీపీఎస్ విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. అధికారం పోగానే అదే అంశంపై ధర్నాలు, ఆందోళనలు చేస్తారని అన్నారు. మరో పార్టీ అధికారంలోకి రాగానే ఏదైనా నిర్ణయం తీసుకుంటే, అదే అంశంపై ధర్నా చేస్తుందని ఉదాహరణలు చెప్పారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసిన ఏకైక పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తమదేనని అన్నారు. అయినా కొంత మంది యువకులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొనని పథకాలనూ అమలు చేస్తున్నామని ఆయన రైతు బంధు, రైతు భీమా పథకాలను ఉదహరించారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి 10 రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు బీమా పథకం కింద అందజేస్తున్నామని, అలా ఇప్పటి వరకు నాలుగు వేల మందికి ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకే ప్రజలు తిరిగి తమ పార్టీని ఆదరించారని కేసీఆర్ చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకంతో రాష్ట్రంలో దాదాపుగా బాల్య వివాహాలు ఆగిపోయాయని, కేసీఆర్ కిట్స్‌తో ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని ఆయన వివరించారు. కంటి వెలుగు పరీక్షలకు ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ చేస్తున్నామన్నారు. కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య కోటికి దాటిందన్నారు. త్వరలో దంత, చెవి, ముక్కు పరీక్షలూ చేయిస్తామని కేసీఆర్ తెలిపారు.
నెలాఖరుకు హైకోర్టు విభజన
హైకోర్టు విభజన ప్రక్రియ నెలాఖరుకు పూర్తి చేస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారని ఆయన తెలిపారు. అందుకే కేంద్రం ఏకఛత్రాధిపత్యం పోవాలని అంటున్నానని ఆయన చెప్పారు. దొంగల భరతం పడతామని, తిన్నది కక్కిస్తామని అన్నారు.