రాష్ట్రీయం

ఖమ్మం.. విభిన్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: రాష్టమ్రంతా ఒక ఎత్తయితే ఖమ్మం ఒకటి ప్రత్యేకమని మరోసారి రుజువైంది. ఎప్పుడు ఏ ఎన్నికల్లోనైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఒక పార్టీకి మెజార్టీ వస్తే ఖమ్మం జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు వెలువడుతుంటాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకోగా ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రజాకూటమి 8 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్‌ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. గతంలో జరిగిన జిల్లా పరిషత్, సహకార బ్యాంకు ఎన్నికల్లో కూడా రాష్టమ్రంతా ఒక పార్టీకి అధికారం దక్కితే ఖమ్మం జిల్లాలో మాత్రం మరో పార్టీకి పట్టం కట్టారు. ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు ప్రభుత్వాల సమయంలో కూడా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకే ఎక్కువ స్థానాలు దక్కాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం కొత్తగూడెం స్థానంలో మాత్రమే విజయం సాధించింది. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో కొత్తగూడెం, ఖమ్మం స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం విశేషం. కానీ ఈసారి కూడా అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ పోటీచేసినప్పటికీ కేవలం ఖమ్మం స్థానంలో మాత్రమే విజయం సాధించింది. అయితే మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ రెండవ స్థానంలోనే నిలిచింది. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 13 స్థానాల్లో పోటీ చేయగా, అందులో ఖమ్మంలోనే మూడు స్థానాలు ఉన్నాయి. ఖమ్మం స్థానంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు పోటీచేయగా ఆయనకు మద్దతుగా కాంగ్రెస్, టీడీపీ జాతీయాధ్యక్షులు రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడుతో పాటు అనేక మంది పెద్దలు ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటమి పాలయ్యారు. అలాగే సీపీఐ పోటీచేసిన వైరా స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అంతేకాకుండా భద్రాచలం నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వరంగల్ జిల్లాకు చెందిన పొడెం వీరయ్య ఊహించని విధంగా ఘనవిజయం సాధించారు. అలాగే సీపీఎంకు గట్టి పట్టున్న భద్రాచలంలో ఆ పార్టీ అభ్యర్థి 13వేల ఓట్లే సాధించగా, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీకి గట్టి పట్టున్న ఇల్లెందు నియోజకవర్గంలో ఆ పార్టీ 12వేల ఓట్లను సాధించింది. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఫలితాలు ఇదేవిధంగా వచ్చాయి.