రాష్ట్రీయం

సెంటిమెంట్.. సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: తెలంగాణ సెంటిమెంట్, సంక్షేమ పథకాల అమలే టీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిపెట్టాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నారాయణ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేకపోయామని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి గతంతో పోలిస్తే ఓట్లు, సీట్లు అధికంగా వచ్చాయని, ముందస్తుకు వెళ్లడం, ఇళ్ల మంజూరు, ఇంటింటికీ నీళ్లు, ఇంటికో ఉద్యోగం హామీల అమలులో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోతారని అంతా భావించామని అన్నారు. అయితే కూటమి ఏర్పాటు అలస్యం కావడం, కూటమి కుదిరినా, పైస్థాయిలో నాయకులు కలిసినా, కిందిస్థాయిలో కేడర్ కలవలేకపోయారని నారాయణ వెల్లడించారు.