రాష్ట్రీయం

వైద్య రంగంలో మనమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, డిసెంబర్ 13: ప్రపంచ వైద్య రంగంలో 2020 సంవత్సరానికి భారత్ అగ్ర స్థానంలో నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచలో ఏ వ్యాపారంలో లేని వృద్ధి వైద్య రంగంలో మాత్రమే ఉందన్నారు. ప్రపంచ వైద్య పరికరాల వ్యాపారంలో 2030 నాటికి 800 యూఎస్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు అనుకుని పెదగంట్యాడలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్‌ను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ చౌబేతో కలిసి గురువారం జాతికి అంకితం చేశారు. అనంతరం వైద్య పరికరాల అభివృద్ధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథ్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు-2018ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య పరికరాల వ్యాపారం 2023 సంవత్సరానికి 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. ఏడాదికి 17శాతం వృద్ధి నమోదు చేస్తున్నది వైద్య రంగం మాత్రమే అన్నారు. ఏడాదికేడాది వైద్య వ్యాపారం గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మెడిటెక్ జోన్‌ను పెట్టుబడిదారుల స్వర్గ్ధామంగా మారుస్తామన్నారు. ఫార్మాస్యూటికల్స్ ప్రపంచానికి భారత్ సత్తా తెలుసన్నారు. వైద్య పరికరాల తయారీ అదే పనితీరును కనబర్చి భవిష్యత్‌లో ప్రపంచ రోల్ మోడల్‌గా భారత్ నిలుస్తుందన్నారు.ప్రపంచ వైద్య పరికరాల తయారీ రంగంలో మెడ్‌టెక్ జోన్ అత్యుత్తమ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు వైద్య ఉత్పత్తులను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. వైద్య రంగంలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఖరీదైన వైద్యం ప్రజలకు, ప్రభుత్వాలకు సవాల్‌గా మారుతోందన్నారు. పది అత్యుత్తమ ప్రపంచ వైద్య ఆవిష్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలవటం దేశానికే గర్వకారణం అన్నారు. మెడ్‌టెక్ జోన్‌లో మార్కెటింగ్, పరిశోధన అభివృద్ధి, ధ్రువీకరణ వంటి సౌకర్యాలన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా చేయడం పరిశ్రమల స్థాపనకు వరంగా మారిందన్నారు. ప్రపంచ వైద్య రంగం ఆర్థిక అభివృద్ధి భారత్ 4వ స్థానంలో నిలుస్తుందన్నారు. జపాన్, చైనా, దక్షిణ కొరియా తరువాత భారత్‌దే స్థానమన్నారు. జాతీయ వైద్య విధానం ప్రకారం వైద్య పరికరాల తయారీ రంగంలో 100 శాతం
విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ సహాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైద్య రంగ అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగాన్ని ప్రోత్సహించేందుకు కలిసి ప్రగతి సాధిద్దామని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి నినాదాలతో దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో 90 దేశాలకు చెందిన 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ వాట్స్, రాష్ట్ర వైద్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు అండ్రీనీయాస్, హెన్‌కో బెకోడియం, మధూర్ గుప్తా, మంత్రులు ఎండి ఫరూఖ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రవణ్‌కుమార్, నిమ్మకాయల చిన్నరాజప్ప, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, మెడ్‌టెక్ ఎండీ జితేంద్రశర్మ, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విశాఖపట్నంలో నిర్వహించిన వైద్యరంగం సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులు