రాష్ట్రీయం

కలవరపెడుతున్న వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారింది. మరో 24 గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం ట్రింకోమలి (శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయంగా 830 కిమీ, చెన్నైకి ఆగ్నేయంగా 1150 కిమీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1330 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ చెన్నై-కడలూరు వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. తీవ్ర వాయుగుండం 15 నాటికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో 14వ తేదీ నుంచి నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 65 నుంచి 75 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, వీటి తీవ్రత 85 కిమీ వేగానికి పెరిగే అవకాశం ఉందన్నారు. సముద్రం కల్లోలంగా ఉంటుందని, అలలు దాదాపు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లినవారు తీరానికి చేరుకోవాలని హెచ్చరించారు. 15వ తేదీ నాటికి తీరానికి సమీపంలో గాలులు 45 నుంచి 55 కిమీకి తగ్గుతాయన్నారు.