రాష్ట్రీయం

పరుగో..పరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి రైల్వే శాఖ కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. 2021-2022 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణలో లైన్ల విద్యుద్ధీకణతోపాటు కొత్తలైన్ల అనుమతి కోసం రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. విద్యుద్ధీకర పూర్తయితే ఏటా రూ. 13వేల కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. రైలు ఇంజన్లకు వాడుతున్న డీజిల్ వల్ల వాతావరణం కాలుష్యం, అధిక వ్యయం అవుతోంది. దాదాపు 4 మిలియన్ల టన్నుల కార్బన్ గాలిలో కలుస్తోందని లెక్కలు చెబుతున్నాయి.
విద్యుత్ వినియోగంతో రైల్వేశాఖకు 37 శాతం ఇంధనం ఆదా అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం థర్మల్, సోలార్ విద్యుత్‌తో రైళ్లు నడుస్తున్నాయి. ఇలా ఉండగా ఇప్పటి వరకు 13వేల కిలోమీటర్ల దూరాన్ని విద్యుద్ధీకరణ చేయడానికి రూ. 12 లక్షల కోట్ల పైచిలుకు ఖర్చు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు సరుకుల రవాణాను వేగవంతం చేయడానికి విద్యుత్ లైన్లు ఆవశ్యకత ఎంతో ఉంది. దేశంలో 50 శాతం మాత్రమే విద్యుత్ లైన్లు ఉన్నాయి. మిగతా లైన్లను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5,992 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉండగా, 3, 250 కిమీ విద్యుద్ధీకరణ పూర్తయింది. కొత్త మార్గంతో పాటు విద్యుత్ లైన్ల కోసం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు 50 శాతం నిధులను భరిస్తున్నాయి. ఏపీలో 2, 839 కిలోమీటర్ల రైలు మార్గం ఉండగా, అందులో 2,112 కిలోమీటర్ల దూరాన్ని విద్యుత్ లైన్లుగా మార్చారు. తెలంగాణలో 936 కిలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు 886 కిలోమీటర్లమేర విద్యుద్ధీకరణ పూర్తయింది. ముంబయి- చెన్నై మార్గంలో వాడీ, గుంతకల్ మార్గంలో 228 కిలోమీటర్లమేర విద్యుద్ధీకరణ చేశారు. ముంబయి- చెన్నై మార్గంలో విద్యుద్ధీకరణ వల్ల బెంగళూరు- ఢిల్లీ మార్గంలో రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గుంటూరు- గుంతకల్ మధ్య విద్యుద్ధీకరణ వల్ల కోల్‌కతా- బెంగళూరు మధ్య రైళ్లు పెరిగాయి. హైదరాబాద్ పరిధిలో బొల్లారం- మల్కాజ్‌గిరి ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కోసం పనులు చేపట్టారు. కొత్తలైన్ల కోసం లింగంపేట్ నుంచి జగిత్వాల- నిజామాబాద్, వికారాబాద్- పర్లి, గద్వాల - రాయచూర్, తెనాలి- రేపల్లి, ధర్మవరం- పాకాల మధ్య విద్యుద్ధీకరణ చేయాల్సి ఉంది. 2021-2022 సంవత్సరాన్ని లక్ష్యంగా నిర్దేషించి 100 శాతం విద్యుద్ధీకరణకు కార్యచరణ రూపొందించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. దేశ వాప్తంగా రైల్వేలైన్ల విద్యుద్ధీకరణ పూర్తయితే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకుపోతాయని వారన్నారు.
ఫైనాన్స్ సలహాదారుగా కుమార్
దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లోప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వజరీగా బ్రజేందర్ కుమార్ గురువా రం బాధ్యతలు చేపట్టారు. ఆయన 1986 సంవత్సరంలో ఐఆర్‌ఎఎస్‌కు ఎంపికయ్యారు. కుమార్‌కు పలు డివిజన్లలో పని చేసిన అనుభవం ఉంది.

చిత్రాలు.. రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్న సిబ్బంది