రాష్ట్రీయం

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన సందర్భంగా గురువారం ఆలయంలో పుష్పయాగాన్ని టీటీడీ నేత్ర పర్వంగా నిర్వహించింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్థాన మండపం నుంచి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకు వచ్చారు. అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణ ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గనే్నరు, రోజా, మల్లెల, కనకాంబరం, తామర, కలువ, మొగలి, మానుసంపంగి ఇతర 12 రకాల పుష్పాలను, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లోగాని, నిత్య కైంకర్యాలల్లోగాని అర్చక పరిచారకులు వల్ల, అధికారులు, అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ, తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగం నిర్వహిస్తారు.
అమ్మవారి పుష్పయాగానికి దాతలు నాలుగు టన్నుల కుసుమాలను అందించారు. ఇందులో తమిళనాడుకు చెందిన దాతలు, కర్ణాటకకు చెందిన భక్తులు ఒక టన్ను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన దాతలు ఒక టన్ను పుష్పాలను అందించారు. ఈకార్యక్రమంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి ఝాన్సీరాణి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వీజీఓ అశోక్ కుమార్ గౌడ్, ఏఈఓ సుబ్రహ్మణ్యం, గార్డెన్ మేనేజర్ జనార్థన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.