రాష్ట్రీయం

నెలాఖరుకు హైకోర్టు భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రీకాస్ట్ టెక్నాలజీతో శరవేగంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ నెల 31 నాటికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో రోడ్ల నిర్మాణ పనులు 1600 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయన్నారు. మార్చి నాటికి మిగిలిన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులను చూసి మాట్లాడాలని విపక్షాలకు సూచించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ నెల 15 నుంచి ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు రాజధాని అమరావతి సందర్శనకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. రోజుకు 25 బస్సులు రాజధాని సందర్శనకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఎన్టీఆర్ విగ్రహం రాగితో నిర్మిస్తామని, మరో మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి 2019 ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

చిత్రం.. పనులను పరిశీలించిన మంత్రి నారాయణ