రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌లో చేరిన వైరా ఎమ్మెల్యే రాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందిన ఎమ్మెల్యే రాములు నాయక్ శనివారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ వైరా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తాం అని చెప్పారు. రాష్టమ్రంతా టీఆర్‌ఎస్ ప్రభంజనం ఉన్నా, ఖమ్మంలో మాత్రం పార్టీకి ఒక్కటే సీటు వచ్చిందన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కష్టపడి పని చేసి జిల్లా వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరేలా చూడాలని ఆయన సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకునేలా కృషి చేద్దామన్నారు.