రాష్ట్రీయం

సమర్థంగా ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 16: ప్రతిఏటా రాష్ట్రానికి పరిపాటిగా మారిన తుపాన్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పెథాయ్ తుపాను ప్రభావంపై ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది ఇది మూడోతుపాను అని, తిత్లీ, గజ తుపాన్ల నష్టాన్ని ముందుగానే వేసిన అంచనాలు నిజమయ్యాయని గుర్తుచేశారు. తీరాన్ని ఎక్కడ తాకుతాయో కచ్చితంగా చెప్పగలిగామన్నారు. భారీ వర్షాల గురించి కూడా ముందే హెచ్చరించామన్నారు. తిత్లీతో తొలి రెండు రోజులు ఇబ్బంది పడ్డామని చెపుతూ గతంలో లోపాలు పునరావృతం కారాదన్నారు. తిత్లీ తుపానుకు కొబ్బరిచెట్లు కూలి తీవ్ర నష్టం జరిగిందన్నారు. వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోయి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని,
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కారాదని నిర్దేశించారు. ముందుగానే అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణలో అప్రమత్తతే కీలకమన్నారు. బాధితులకు అండగా ఉండటం ప్రధానమని ఉద్ఘాటించారు. సకాలంలో విద్యుత్ పునరుద్ధరణ జరగాలన్నారు. ట్రాఫిక్‌ను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. నేలకూలిన చెట్లను వెంటనే తొలగించి రహదారులకు పడిన గండ్లను సత్వరమే పూడ్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయాలని, అందుకు తగ్గట్టుగా వనరులు సమీకరించాలని కోరారు. విద్యుత్ స్తంభాలు ఎన్ని అవసరం, వాటిని ఎక్కడి నుంచి తెప్పించాలనేది ముందుగానే సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ రంపాలతో పాటు జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు.
తుపాను బాధితులకు ఇబ్బందుల నుంచి ఎంత త్వరగా ఉపశమనం కల్పించామనేదే ప్రధానమన్నారు. కింది నుంచి పైస్థాయి వరకు యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని, నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరుతో ప్రజల మెప్పు పొందాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలదే కీలక బాధ్యత అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సేవలే ముఖ్యమన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా అప్రమత్తం కావాలన్నారు. ఆహార ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి సన్నద్ధం కావాలన్నారు. బియ్యం, పప్పులు, వంటనూనె, బంగాళదుంప, ఉల్లి సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో అందరినీ అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణలో పౌరుల బాధ్యతలను గుర్తు చేయాలన్నారు. సహాయ, పునరావాస చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఒక ఫోర్స్‌ను సిద్ధం చేసుకుని పునరావాస చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వరికోతలు, పంట నూర్పిళ్లు ముందే పూర్తయ్యేలా చూడాలన్నారు. ధాన్యానికి నష్టం లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.