రాష్ట్రీయం

తుపాను ప్రాంతాల్లో నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తుపాను సమయాల్లో విద్యుత్ శాఖ కీలక భూమిక పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన జనరేటర్లు, విద్యుత్ స్తంభాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా లైన్లు దెబ్బతింటే అప్పటికప్పుడు పునరుద్ధరించేందుకు అవసరమైన జేసీబీలు, క్రేన్లను ఆయా జిల్లాలకు తరలించాలని ఆదేశించారు. బాధితులకు మంచినీరు అందించి వైద్యసేవలను అందుబాటులోకి తేవటంతో పాటు సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా సెల్‌టవర్లను పర్యవేక్షించాలన్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తిత్లీ తుపాను నాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సిబ్బంది పనిచేయాలన్నారు. హైటెన్షన్ టవర్లతో పాటు 40వేల స్తంభాల పునరుద్ధరణకు 10నుంచి 12రోజుల వ్యవధి పట్టిందని, పెథాయ్ తుపాను సందర్భంగా మరిన్ని ముందుజాగ్రత్తలు పాటించాలని సూచించారు. డిస్కంల సీఎండీ స్థాయి నుంచి లైన్‌మెన్ వరకు తుపాను సహాయ, పునరావాస
పనుల్లో నిమగ్నం కావాలని నిర్దేశించారు. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు మండలాల వారీగా సరఫరా, పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని ప్రజలు ఏమాత్రం సహించరని, తుపాను పరిస్థితుల పట్ల వారిలో అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల నుంచి విద్యుత్ ర్యాటిఫికేషన్ బృందాలను ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు తరలించాలని నిర్దేశించారు. కాకినాడ, అమలాపురం ప్రాంతాలకు అవసరమైన విద్యుత్ యంత్ర సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. సముద్ర తీరానికి 5నుంచి 20కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను కంప్యూటర్ మ్యాప్‌ల ద్వారా గుర్తించి 33, 11 కేవీ ఫీడర్ల ద్వారా సరఫరా ఏరకంగా అందించవచ్చనేది పరిశీలించాలని సూచించారు. విద్యుత్ పంపిణీ, సరఫరాలో ఎలాంటి అంతరాయం కలిగించకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ముఖ్యమంత్రికి వివరించారు. నెల్లూరు, రాయలసీమ జిల్లాల నుంచి కొందరిని శనివారం రాత్రే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు పంపామన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు ఆదివారం వరకు 10వేల విద్యుత్ స్తంభాలను తరలించామని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలకు ఈపీడీసీఎల్ ఇప్పటికే 2వేల మంది సిబ్బందిని నియమించిందని తెలిపారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒక్కో సబ్‌స్టేషన్ పరిధిలో 500 మందిని అందుబాటులో ఉంచామన్నారు. ఒక్కో మండలంలో సీఈ, ఈఈ విద్యుత్ లైన్లను పరిశీలిస్తారని, వివిధ మండలాలకు ఒకరు చొప్పున డిస్కంల డైరెక్టర్లు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారన్నారు. డీఈ స్థాయిలో అధికారి 33కేవీ సబ్‌స్టేషన్లు, ఏడీఈ, ఏఈలతో కలిపి 11కేవీ సబ్‌స్టేషన్ల వద్ద నియమితులయ్యారని వివరించారు. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న వనరులు, అవసరమైన చర్యల గురించి కేంద్ర కార్యాలయం పర్యవేక్షిస్తుందని ఆయన వివరించారు. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కళా వెంకట్రావు, విద్యుత్ శాఖ సలహాదారు కె రంగనాథం, ఐటీ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ కె విజయానంద్, డిస్కంల సీఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర పాల్గొన్నారు.