రాష్ట్రీయం

ముందు జాగ్రత్తలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పెథాయ్ తుపానుతో అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్‌లో
సూచించారు. ఒకవేళ సోమవారం మధ్యాహ్నం తీరం దాటకపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ సూచించారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఏడు జిల్లాలకు పెథాయ్ తుపాను తాకనున్నదని, కాబట్టి తాగు నీటితో సహా అన్ని సహాయక చర్యలు తీసుకున్నామని, అన్ని స్థాయిలో అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటామని గవర్నర్‌కు వివరించారు. పెథాయ్ తుపానును ఎదుర్కొనేందుకు తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని చంద్రబాబు గవర్నర్‌కు తెలిపారు.