రాష్ట్రీయం

హెచ్‌సియు వివాదంపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. విద్యార్ధుల సంఘర్షణలకు కారణాలను అనే్వషించి, వాటి పరిష్కారానికి యూనివర్శిటీ చర్యలు తీసుకుంటోంది. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డీన్ ప్రొఫెసర్ బి కామయ్య అధ్యక్షతన ఏడుగురు సభ్యుల కమిటీని యూనివర్శిటీ నియమించింది. యూనివర్శిటీలో సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా యూనివర్శిటీ పేరు ప్రతిష్ఠలు ఇనుమడించాయంటే ఇక్కడ ఉన్న విద్యార్ధులు, సిబ్బంది వల్లనేనని విసి పేర్కొన్నారు. అయితే ఇటీవల జరిగిన ఘటనలు క్యాంపస్‌లో ఉన్న వారితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ కొంత బాధ కలిగించాయని విసి అన్నారు. ప్రపంచంలోనే మేటి వర్శిటీగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి ఆందోళనలు సరికాదని విసి పేర్కొన్నారు. అంతర్లీన క్షమాగుణాన్ని విద్యార్ధులు, సిబ్బంది పాటించాలని, ఆగ్రహాలకు, వైరుధ్య వైఖరులకు అతీతంగా విద్యార్ధులు ఎదగాలని ఆయన హితవుపలికారు. ఏ సమస్యపైనైనా చర్చించేందుకు తాను, సిబ్బంది సిద్ధమని పేర్కొన్నారు. కాగా యూనివర్శిటీలో బంద్ జరిగినా పరీక్షలు యథాతథంగా జరిగాయని పేర్కొన్నారు. యూనివర్శిటీలో 5200 మంది విద్యార్ధులుండగా, వారిలో దాదాపు 200 మంది మెయిన్ గేట్ నుండి పరిపాలనా భవనం వరకూ శాంతియుతంగా ప్రదర్శన చేశారని చెప్పారు. కాగా ఇటీవల సస్పెండ్ అయిన వి సుంకన్న తన పిహెచ్‌డి థీసిస్‌ను విజయవంతంగా సమర్పించారని వర్శిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
వర్శిటీ కమిటీ
హెచ్‌సియులో అస్తవ్యస్థంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు యూనివర్శిటీ స్థాయి కమిటీని వేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం కొనసాగుతున్న ఆందోళనను విరమింపచేసి తిరిగి యథాస్థితికి తెచ్చేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు ప్రొఫెసర్ కామయ్య అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కామయ్యతోపాటు రాజనీతి శాస్త్రానికి చెందిన ప్రొఫెసర్ జి సుదర్శనం, మానవ హక్కుల కేంద్రానికి చెందిన బి చంద్రశేఖరావు, సామాజిక మానవ శాస్త్రానికి చెందిన ప్రొఫెసర్ ఎన్ సుధాకరరావు, తెలుగు శాఖకు చెందిన ప్రొఫెసర్ శరత్‌జ్యోత్న్సారాణి, ఆరోగ్య విభాగానికి చెందిన ప్రొఫెసర్ మీనా హరిహరన్, డాక్టర్ నియాజ్ అహ్మద్ సభ్యులుగా ఉంటారు. వీరంతా విద్యార్ధి నాయకులతో, జెఎసి నాయకులతో చర్చించి వారి ప్రధాన డిమాండ్లు ఏమిటో తెలుసుకుంటారు. అనంతరం పరిష్కార మార్గాలను సూచిస్తారు.

చిత్రం సోమవారం హెచ్‌ఆర్‌సి ముందు హాజరై
తిరిగి వెళుతున్న హెచ్‌సియు విసి అప్పారావు