రాష్ట్రీయం

ఎముకల మార్పు ఎప్పుడైనా సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 16: మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఎముకల స్థితిలో వచ్చే మార్పులను ఎప్పుడైనా సరిచేయవచ్చని బర్డ్స్ తిరుపతి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. ఆదివారం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని ఆర్థోపెడిక్ విభాగంలో రాష్ట్ర వైద్య విద్యార్థుల సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎముకలు, కీళ్ల శస్తచ్రికిత్సా విభాగంలో సరికొత్త విధానాలు వస్తున్నాయని, వీటిని అనుసరించడం వల్ల అధునాతన సంప్రదాయ జీవితాన్ని సమాజం అనుభవించవచ్చని చెప్పారు. జన్మతః ఎముకల వంకర, సరిగా నిర్మాణం జరగకపోవడం వల్ల అనేక మంది చికిత్స పొందుతున్నారన్నారు. విరిగిన ఎముకలను అతికించే పద్ధతి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతోందన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో అధునాతన విధానాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వాస్తవంగా ఎముకల పుట్టుక, విరగడం అనేవి మానవ తప్పిదాలని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది గాయాలు, ఎముకలు విరగడం వంటి ఇబ్బందులతో ఆసుపత్రలను సంప్రదిస్తున్నారన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఎముకలను అదే ప్రదేశంలో తిరిగి అతికించడం ద్వారా రోగులకు చికిత్స అందించవచ్చని ఆయన వివరించారు. జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గంటా వరప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారినపడిన క్షతగాత్రులకు శస్తచ్రికిత్సల అనంతరం గాయాలైన ప్రదేశాల వద్ద వెంటనే ఎముకలకు చీము చేరడం వంటి ఇన్‌ఫెక్షన్లు సోకటం వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం ఎల్‌ఆర్‌ఎస్ (లీ రీప్లేస్‌మెంట్ పద్ధతి) ద్వారా ఎముకలను తిరిగి అమర్చే అధునాతన సౌకర్యాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విధానాలను వైద్య విద్యార్థులు అందిపుచ్చుకుంటే ఎముకలు, కీళ్ల విభాగంలో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడతాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు, రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వంద మంది పీజీ వైద్య విద్యార్థులు, 20మంది అసోసియేట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
చిత్రాలు.. రాష్ట్ర ఆర్థో సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న డాక్టర్ జగదీష్, వరప్రసాద్
* పీజీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్ గంటా వరప్రసాద్