రాష్ట్రీయం

నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 16: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈనెల 16వ తేదీన ప్రారంభమైంది. ఈ సాయంత్రం 5.19 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2019, జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ సమయంలోనే అన్ని విష్ణు ఆలయాల్లో విశేష పూజలు జరుపుతారు. 12మంది ఆళ్వార్లుల్లో ఒకరైన గోదాదేవి రచించిన 30 పాశురాలను తిరుప్పావై అంటారు. ఈగ్రంథంలో రోజుకు ఒక్కొక్క పాశురాన్ని స్వామిని విన్నవిస్తూ పూజలుచేస్తారు. ఈసందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.