రాష్ట్రీయం

పెను విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి/విశాఖపట్నం, డిసెంబర్ 17: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను పెథాయ్ సోమవారం మధ్యాహ్నం యానాం సమీపంలో తీరం దాటింది. తీరం దాటిన తుపాను తీవ్ర అల్పపీడనంగా కాకినాడ వద్ద బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ఇది మరింత బలహీనపడి క్రమంగా ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారి యానాం వద్ద ఉపరితలంపైకి చేరుకుంటుందని పేర్కొన్నారు. తుపాను బలహీనపడినప్పటికీ తీరం వెంబడి ఈశాన్య దిశ నుంచి గంటకు 55 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అన్ని ప్రధాన పోర్టుల్లోనూ మూడవ నెంబర్ ప్రమాద సూచిని ఎగురవేశారు. పెథాయ్ తీరం దాటే సమయంలో కోస్తా అంతటా భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో అత్యధికంగా 13 సెంమీ, విశాఖపట్నం 11 సెంమీ, గుడివాడ 10 సెంమీ, నూజివీడు 9 సెంమీ, ఏలూరు చింతలపూడి, రేపల్లె, తెనాలిలో 7 సెంమీ వర్షపాతం నమోదైంది. కుకునూరు, తిరువూరు, వరరామచంద్రపురం, మంగళగిరిలో 6 సెంమీ వర్షపాతం కురిసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అశ్వారావుపేట, సత్తుపల్లిలో 9 సెంమీ, ములకలపల్లి, చంద్రగిరిలో 8సెంమీ, కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపహాడ్, మణుగూరులో 7 సెంమీ, పినపాక 6 సెంమీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు విశాఖ ఆర్కే బీచ్‌లో తీరం కోతకు గురైంది. భీమిలిలో సముద్రం కొంతమేర ముందుకు చొచ్చుకు వచ్చింది.
పెథాయ్ తుపాను కోస్తాలో అల్లకల్లోలం సృష్టించింది. పెనుగాలుల విధ్వంసానికి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద సోమవారం మధ్యాహ్నం 3.24 గంటలకు తుపాను పూర్తిగా
తీరం దాటిన నేపథ్యంలో తీరంలో అలల ఉద్ధృతి పెరిగింది. 5 నుంచి 8 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. వేలాది ఎకరాల్లో వరిచేలు నీట నానుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల తాకిడికి అరటి చెట్లు నేలరాలాయి. నూర్పిళ్లు పూర్తయి కళ్లాల్లో పరదాల్లో కప్పివుంచిన ధాన్యం కూడా తుపాను తాకిడికి కొట్టుకుపోవటంతో రైతాంగం గుండె చెరువైంది. వందల ఎకరాల్లో అరటి చెట్లు నేలకూలాయి. కాగా తీర ప్రాంతంలో ఈదురుగాలులు, వర్షం ధాటికి రొయ్యల చెరువుల్లో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. లక్ష ఎకరాల్లో కోతకు వచ్చిన వరిపైరు తడిసి ముద్దయింది. దీంతో రైతుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఏడాది కష్టం ఏటిపాలైందని వాపోతున్నారు. గుంటూరు జిల్లాలోని వివిధ మండలాల్లో ఒకటి నుంచి పది సెంటీమీటర్లు, కృష్ణా జిల్లాలో 10 నుంచి 15, తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. తూర్పు గోదావరి జిల్లాలో 180తో పాటు రాష్టవ్య్రాప్తంగా తుపాను ప్రభావిత జిల్లాల్లో 538 సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో 50 వేల మందికి పైగా తలదాచుకుంటున్నారు.
వరికి అపార నష్టం
ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే కొట్టుకుపోవటంతో రైతాంగం కంట తడిపెడుతున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా నాణ్యత తగ్గిందనే సాకుతో క్వింటాల్‌కు వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, తుపాను కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు వల్ల కనీస పెట్టుబడులు కూడా తిరిగివచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎకరానికి రూ 10వేల పెట్టుబడితో పాటు రూ 25వేల వరకు పెట్టుబడి పెట్టి మరికొద్ది రోజుల్లో ఇంటికి తరలించే ప్రయత్నంలో పెథాయ్ తుపాను ఆశనిపాతంలా మారిందని వాపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 297 టెలికం టవర్లు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.
తీవ్రమైన చలిగాలులతో పాటు పెథాయ్ తుపాను ప్రభావం కారణంగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులకు రాష్టవ్య్రాప్తంగా ఐదుగురు మృతిచెందగా, విజయవాడ క్రీస్తురాజపురంలో కొండ చెరియ విరిగిపడి మరో వ్యక్తి దుర్మరణం చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో ఓ వృద్ధురాలు, చీరాల ఐక్యనగర్‌లో వెంకయ్య (73), నూనె కుమారి (61), ప్రకాశం జిల్లా వేటపాలెం బస్‌షెల్టర్‌లో తలదాచుకుంటున్న మరో వృద్ధుడు, విశాఖ జిల్లా హుకుంపేట మండలం దాలిమ్మగుడిలో ఆశ్రయం పొందుతున్న ఓ ఓ వ్యక్తి చలిగాలులకు మృతిచెందారు. కాగా విజయవాడ క్రీస్తురాజ పురంలో కొండ చరియ ఇంటిమీద విరిగిపడి రంగాల దుర్గారావు (28) అనే వ్యక్తి మృతిచెందాడు.
కృష్ణానదికి వరద ఉద్ధృతి
తుపాను, భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి ఏర్పడింది. ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతున్నందున 7వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. క్రస్ట్‌గేట్ల వద్ద 12 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. దిగువకు నీటిని వదిలిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ, పెనమలూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరుతో పాటు నదీ పరివాహక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.
చిత్రాలు.. విశాఖలో కోతకు గురైన బీచ్ *పశ్చిమ గోదావరిలో రహదారిపై కూలిన చెట్టు