రాష్ట్రీయం

ముందు జాగ్రత్త వల్లే ప్రమాదం తప్పింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం రాత్రి సమీక్ష జరిపారు. రియల్‌టైం గవర్నెన్స్ సెంటర్ ద్వారా ప్రాథమిక నష్టం అంచనాలను పరిశీలించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్లే పెను ప్రమాదం తప్పిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రాణనష్టం జరగలేదని, విద్యుత్ సరఫరాలో మాత్రం అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. వెంటనే సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. రెండురోజుల్లో పంటనష్టం అంచనా వేసి 20వ తేదీకల్లా బాధితులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తీరప్రాంతంలోని మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. అధికారులు అప్రమత్తమై తుపాను ముందు జాగ్రత్తలు తీసుకున్నారు క్షేత్రస్థాయిలో అందరినీ సిద్ధం
చేశారు. అత్యవసర సమయాల్లో అన్ని శాఖల్లో ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలన్నారు. హుదూద్, తిత్లీ తుపాను అనుభవాలతో పెథాయ్ తుపానుకు ముందు నుంచే అప్రతమ్తం చేశామన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎలా చేసిందీ డాక్యుమెంటరీ చేయాలని రానున్న విపత్తులకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. ప్రతి విద్యుత్ స్తంభాన్ని జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఇలాంటి విపత్తులలో పునరుద్ధరణ సులభతరమవుతుందని చెప్పారు. ఆర్టీజీ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెథాయ్ తుపాను తీరాన్ని దాటిందని, ఏజెన్సీ ప్రాంతంలో వాయుగుండంగా మారి ఒడిశా వైపు పయనిస్తోందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావాన్ని ముందుగానే అంచనావేసి జాగ్రత్తలు తీసుకున్నాం.. మానవ వనరులను అందుబాటులో ఉంచాం.. ఇలాంటి విపత్తులకు ముందుగా సిద్ధం కావటమే ముఖ్యమన్నారు. మాక్‌డ్రిల్ వంటి కసరత్తులు చేయటం వల్ల నమ్మకం వస్తుందన్నారు. ప్రాణనష్టం, పశునష్టం జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
విద్యుత్ సౌకర్యం ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. జరిగిన నష్టాన్ని తక్షణం అంచనావేసి గంటల వ్యవధిలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్దేశించారు. ఇది మనకు ఓ రిహార్సల్ వంటిదని చెప్తూ భవిష్యత్‌లో ఎలాంటి విపత్తులు వచ్చినా సమర్ధంగా ఎదుర్కొనేందుకు స్థయిర్యాన్ని నింపుతుందన్నారు. తాగునీరు, ఆహారం అందుబాటులో ఉన్నాయా లేవా అనేది ఆరాతీస్తే 95 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారని వివరించారు. విపత్తుల సమయాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలనుకున్నాం.. ఎప్పుడైనా ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాలి.. ప్రజలు చొరవ తీసుకుంటే ఫలితాలు వేరుగా ఉంటాయన్నారు. ఇది చిన్న తుపాను అయినప్పటికీ అనుభవాలను డాక్యుమెంట్‌చేసి రేపటి అవసరాలకు సిద్ధం కావాలని ఉద్ఘాటించారు. ఆర్టీజీ సీఈఒ అహ్మద్ బాబు మాట్లాడుతూ తీరానికి 14 వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే తుపాను హెచ్చరికలు జారీచేశామన్నారు. యానాం నుంచి తుని లోపల ఉండగా తుపాను కదలికలను కచ్చితంగా అంచనా వేశామన్నారు. పునరావాస కేంద్రాల్లో 57 వేల మందికి పైగా మధ్యాహ్న భోజనం అందించ గలిగామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 14వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. శీతల గాలులకు 300 గొర్రెలు మృత్యువాత పడ్డాయని తెలిపారు. తుపాను వేగం కంటే ముందుగానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 166 మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైందని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 297 టెలికాం సెంటర్లు దెబ్బతిన్నాయి. సహాయక చర్యల్లో రెండువేల మంది సిబ్బందిని భాగస్వాములను చేసినట్లు తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి, కార్మికశాఖ కమిషనర్ వరప్రసాద్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేరారని తెలిపారు. మొత్తంగా 460 డీజిల్ జనరేటర్లు, తాత్కాలిక విద్యుద్దీపాలను సిద్ధం చేశామన్నారు. 538 తుపాను సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిశా దిశగా కదులుతున్న పెథాయ్ క్రమేణా బలహీనపడుతూ ప్రయాణిస్తోందని ఇస్రో అధికారి రాజశేఖర్ తెలిపారు. మరో 24 గంటల పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పెనుగాలుల వేగాన్ని బట్టి ఎన్ని విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతాయో అంచనావేసే సాంకేతికతను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గాలివేగం, గాలిలో కాలుష్యం స్థాయిని అంచనావేసే సాంకేతికతను అభివృద్ధి చేయాలన్నారు. మంగళవారం నాటికి 70 డ్రోన్లతో పంటల నష్టం అంచనా తెలుసుకుంటామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన నష్టంపై మంత్రులు నారాయణ, చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయను టెలీకాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అమలాపురం ప్రాంతంలో కొబ్బరి చెట్లు విరిగి పడ్డాయని ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స చేయించినట్టు కలెక్టర్ తెలిపారు. తుపాను కారణంగా 89 (33కేవీ) సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయని వెంటే 84 సబ్‌స్టేషన్లను పునరుద్ధరించామని 379 స్తంభాలకు గాను 146 స్తంభాలను పునరుద్ధరించినట్లు ఇంధన, వౌలిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. మత్స్యకారులకు నిత్యావసరాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంట నష్టాన్ని రెండురోజుల్లో అంచనావేసి 20వ తేదీకల్లా పరిహారాన్ని అందించాలన్నారు. వర్ష ప్రభావిత గ్రామాల్లో క్లోరినేషన్ చేయించాలన్నారు. అంటువ్యాధులు వ్యాప్తిచెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. తుపాను విధుల్లో 51 మంది ఐఏఎస్ అధికారులు సేవలందించారని అభినందించారు. విశాఖలో ఏడుగురు మత్స్యకారులతో ఉన్న పడవ గల్లంతయిందని మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి తెలిపారు.

చిత్రం..సహాయక చర్యలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు