రాష్ట్రీయం

ఇంటింటికీ నల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2019 మార్చి 31 నాటికి ప్రతి ఇంటికీ నల్లాబిగించి తాగునీటి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుఆదేశించారు. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో, ఏ ఒక్క మనిషి కూడా మంచినీళ్ల కోసం బిందెపట్టుకుని వీధుల్లో కనిపించకూడదన్నారు. అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే తాగునీరు అందించాలన్నారు. ఇందుకోసం ఖర్చుకు వెనుకాడవద్దన్నారు. ప్రగతిభవన్‌లో సోమవారం మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దళితవాడలు, ఆదివాసీ గూడేలు, శివారుప్రాంతాలు, మారుమూల పల్లెలన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్దిచేసిన మంచినీటిని ఇవ్వాలని ఆదేశించారు. అచ్చంపేట, సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం తదితర జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు నీటిసరఫరా చేయాలన్నారు గుట్టల ప్రాంతాలు ఎత్తుగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా నీటిసరఫరా చేయాల్సిందేనన్నారు. జనవరి 10 లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీరు చేరాలని గడువు విధించారు. మార్చి 31 లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఆవాసప్రాంతానికి నీటిని సరఫరా చేయడంతోనే బాధ్యత తీరిపోదని, ఆ తర్వాత నిరాటంకంగా ప్రతిరోజూ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నీటి సరఫరా ఆగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తొలుత మిషన్ భగీరథపై అనేక మందికి అనేక అనుమానాలు ఉండేవని, ఇంజనీర్లు శ్రమించి ఈ ప్రాజెక్టును పూర్తి చేశారని అభినందించారు. ప్రతి గ్రామానికి నదీ జలాలను అందించగల ప్రణాళికలను రూపొందించుకున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా అద్భుతాన్ని ఆవిష్కరించగలిగామన్నారు. మిషన్ భగీరథ విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. అనేక రాష్ట్రాల నుండి అధికారులు ఇక్కడకు వస్తున్నారని, మిషన్ భగీరథ పరిశీలిస్తున్నారని, తమ తమ రాష్ట్రాల్లో ఈ తరహా ప్రాజెక్టు అమలు చేసేందుకు సహకారం అందించాలని కోరుతున్నారన్నారు. మిషన్‌భగీరథలో భాగంగా ఉన్న సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో 23,968 ఆవాసప్రాంతాలు ఉండగా, 23,947 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతోందన్నారు. మరో 21 గ్రామాలకు మాత్రమే నీరు అందాల్సి ఉందన్నారు. ఈ గ్రామాలు కూడా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగురామన్న, గొంగిడి సునీత, రాజేందర్‌రెడ్డి, కే. విద్యాసాగరరావు, భాస్కర్‌రావు, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితాసభర్వాల్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, వివిధ జిల్లాల సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు హాజరయ్యారు.

చిత్రం..ప్రగతి భవన్‌లో మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్