రాష్ట్రీయం

సీఎం ప్రత్యేక విమానానికి ఏటీసీ అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానం విశాఖలో దిగేందుకు ఏటీసీ అభ్యంతరం చెప్పటంతో ఆయన విశాఖ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవాలకు హాజరై సోమవారం సాయంత్రం పెథాయ్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు ప్రత్యేక విమానంలో భోపాల్ నుంచి విశాఖపట్నం బయల్దేరారు. అయితే తుపాను కారణంగా అప్పటికే విశాఖ నుంచి 14 విమాన సర్వీసులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. రాజమండ్రిలో ల్యాండ్ అయ్యే ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో నేరుగా గన్నవరం విమానాశ్రయానికి తిరుగుపయన మయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనను మంగళవారం నాటికి వాయిదా వేసుకున్నారు.