రాష్ట్రీయం

కొత్తగా 6 ఐటీ కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఐటీ రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా, తాజాగా మరో ఆరు కంపెనీలు రాజధాని అమరావతిలో బుధవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో రాష్ట్రం కూడా ఐటీ హబ్‌గా మారుతోందనవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఏన్నార్టీ కార్యాలయం ఇన్ఫోసైట్ భవనంలో ఏర్పాటైన ఐదు కంపెనీలను మంత్రి ప్రారంభించనున్నారు. జిటి కనెక్టు ఇండియా, పారికరం ఐటి సొల్యూషన్స్, టెక్ స్కేప్, ట్రెండ్ సాఫ్ట్, డియాగ్నో స్మార్ట్ సొల్యూషన్స్ కంపెనీలు తమ కార్యాకలాపాలను ప్రారంభించనున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఐటీ రంగం జీరోగా ఉండేది. రాష్ట్రంలో ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆనేక రాయితీలతో అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఇక్కడ ఐటీ పాలసీలను రూపొందించారు. మంత్రి చొరవతో తీసుకువచ్చిన డీటీపీ పాలసీ చిన్న, మధ్య తరగతి కంపెనీలకు వరంగా మారింది. 50 శాతం అద్దె రాయితీతో అద్దెకు భవనాలు ప్లగ్ అండ్ ప్లే విధానంలో లభిస్తుండటంతో భారీ ఎత్తున ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇందుకు ఏపీఎన్నార్టీ, ఏపీఈఐటీఏ సహకాకరం కూడా ఉపయోగపడుతోంది. విజయవాడలో బిజినెస్ స్పేసెస్ కార్యాలయంలో ఏపీ ఆన్‌లైన్ కంపెనీని ప్రారంభించనున్నారు. ఈ ఆరు కంపెనీలతో 600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటి వరకూ ఏపీఎన్నార్టీ ద్వారా 87 చిన్న కంపెనీలు ఏర్పాటు కాగా, 4610 మందికి ఉపాధి లభించింది. ఇలాఉంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రఖ్యాతి గాంచిన టీసీఎల్ కార్యాకలాపాలు త్వరలో తిరుపతిలో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుటు చేతుల ఈ నెల 20న భూమి పూజ నిర్వహించనున్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్
మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది. దీంతో తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారనుంది. ఏపీలో 2200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. డిసెంబర్ 2019 నాటికి ఉత్పత్తి ప్రారంభించేందుకు లక్ష్యంగా నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ కంపెనీ ఏపీకి రావడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. భారత్‌లో ప్రతి సంవత్సరం 500 బిలియన్ డాలర్ల విలువైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జరుగుతుండగా, అందులో 250 బిలియన్ డాలర్ల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఏపీలో తయారు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీసీఎల్ కంపెనీ ప్రతినిధులకు వివరించడంలో ఆయన కృతకృత్యులయ్యారు.