రాష్ట్రీయం

టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చింతమనేని హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 18: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం తెల్లవారుజామున 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద కొంతసేపు హడావుడి చేశారు. ఎమ్మెల్యేనని చెప్పినా ఫీజు చెల్లించాల్సిందేనని సిబ్బంది పట్టుబట్టడంతో అవమానంగా భావించిన చింతమనేని తన కారు అక్కడే వదిలేసి బస్సులో వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి కారులో వస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు టోల్‌ప్లాజా వద్దకు రాగానే ఫీజు చెల్లించమని సిబ్బంది అడిగారు. అయితే తాను ఎమ్మెల్యేనంటూ చింతమనేని బదులిచ్చారు. కారు వెనుక సీట్‌లో ఉన్న గన్‌మెన్ కూడా ఆయన ఎమ్మెల్యే అని సిబ్బందికి చెప్పినా వినిపించుకోలేదు. టోల్‌ప్లాజా సిబ్బంది ప్రవర్తన పట్ల విసుగుచెందిన ప్రభాకర్ కారును అక్కడే వదిలి వెనుకగా వస్తున్న బస్సు ఎక్కి వెళ్లిపోయారు. తరువాత పోలీసు స్టేషనులో టోల్‌ప్లాజా సిబ్బందిపై ఫిర్యాదు చేశారు.