రాష్ట్రీయం

సమస్యలు ఆలకిస్తూ సాగిన జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటబొమ్మాళి: సమస్యలు వింటూ వానలోనే వైసీపీ అధినేత జగన్ మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం సౌడాం గ్రామంలోకి ప్రవేశించారు. సోమవారం జలుమూరు మండలం, చల్లపేటలో బస చేసిన జగన్ అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చారు. మంగళవారం ఉదయం నుంచి మబ్బులు, చిన్నపాటి వర్షం కురుస్తుండగా పాదయాత్ర సాగించిన జగన్‌ను ఆయా గ్రామాల ప్రజలు కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సౌడాం, రేగులపాడు, దుప్పిలపాడు, గంగుపేట, కస్పూరిపేట, కొబ్బరిచెట్లపేట గ్రామాల మీదుగా జర్జంగి గోవింద్‌రాక్స్ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన బసకు జగన్ 12 గంటల సమయంలో చేరుకున్నారు. రేగులపాడు వద్ద పలువురు రైతులు తిత్లీ తుపాన్ వల్ల పంట నష్టపోయామని, ఇప్పుడు పెథాయ్ తుపాన్ వర్షాలకు మెట్టప్రాంత పంట పాడైనాయని జగన్‌కు విన్నవించారు. టామాటా,క్యాబేజీ తదితర కూరగాయల పంటలను పాడైనట్లు జగన్‌కు చూపించారు. ఏనేటికొండలజాతి ఎస్టీ జాబితాలో చేర్పించాలని నీలంపేటకు చెందిన బి.లక్ష్మి ఆధ్వర్యంలో కొందరు జగన్‌కు విన్నవించారు. కస్తూరిపాడు, నీలంపేట ప్రాంతాల్లో ఏనేటికొండల జాతులు వారు ఉన్నారని, గతంలో ఎస్టీ జాబితాలో ఉండేవారన్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో ఒక్కపూటతో జగన్ పాదయాత్ర ఆగిపోయి జర్జింగిలో ముగించారు.
జగన్ వెంట వైసీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, కళావతి, దువ్వాడ శ్రీనివాస్, రెడ్డిశాంతి, పేరాడ తిలక్, మామిడి శ్రీకాంత్‌లున్నారు.

చిత్రం..కోటబొమ్మాళి మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైసీపీ అధినేత జగన్