రాష్ట్రీయం

కడపలో 5 నుంచి ఎగరనున్న విమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 28: నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు కడప విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి విజయవాడకు, 8 నుంచి హైదరాబాద్, తిరుపతిలకు విమాన సర్వీసులు నడపడానికి చర్యలు పూర్తయ్యాయి. గతంలో ఈ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమాన రాకపోకలను కొనసాగించారు. అయితే తగినంత మంది ప్రయాణికులు లేకపోవడంతో 4 నెలల క్రితం సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ చర్యలు తీసుకుని వచ్చే నెల 5 నుంచి కడప-విజయవాడ మధ్య, 8 నుంచి కడప-హైదరాబాద్, తిరుపతిలకు సర్వీసులు నడపనున్నారు. అయతే హైదరాబాద్, తిరుపతిలకు మాత్రం వారంలో మూడు రోజులు, విజయవాడకు వారంలో నాలుగు రోజుల పాటు విమానాలు నడపనున్నారు. హైదరాబాద్‌కు నడిపే విమానాలన్నీ తిరుపతికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు కొనసాగించనున్నారు. బ్రిటీష్ హయాంలో నిర్మించిన కడప విమానాశ్రయాన్ని ఇంధనాన్ని నింపుకోవడానికి మాత్రమే వినియోగిస్తుండగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో విమానాశ్రయానికి మరమ్మతులు చేసి విమానాలు నడిపించారు.

15 నుంచి ఢిల్లీకి మూడో విమాన సర్వీసు
విజయవాడ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెల్లవారుఝామున చికాగో, శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్ వంటి నగరాలకు ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్లేవారి సంఖ్య నానాటికీ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రివేళ విజయవాడ నుంచి ఢిల్లీకి మరో విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 15 నుంచి సాయంత్రం 6.50కి ఈ విమానం ఢిల్లీలో బయలుదేరి రాత్రి 9.10కి గన్నవరం చేరుతుందని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) సోమవారం ఇక్కడ తెలిపారు. ఈ విమానం వెంటనే 9.50కి బయలుదేరి ఢిల్లీకి 12 గంటలకు చేరుతుందన్నారు. ప్రస్తుతం గన్నవరం నుంచి ఉదయం 9 గంటలకు ఒక విమానం నేరుగా ఢిల్లీకి వెళుతోంది. రెండో విమానం సాయంత్రం 5.20కి బయలుదేరి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి చేరుతోంది.