రాష్ట్రీయం

సస్పెన్షన్ వ్యవహారంలో మళ్లీ సుప్రీం కోర్టుకు రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఏడాది కాలం పాటు సస్పెన్షన్‌కు గురైన వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా మంగళవారం మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేయడంపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. గతంలో హై కోర్టు సింగిల్ బెంచ్ రోజాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో అక్కడ రోజాకు చుక్కెదురైన విషయం తెలిసిందే. కాగా, రోజా విలేఖర్లతో మాట్లాడుతూ, మహిళల సమస్యలపై శాసనసభలో నిలదీస్తున్నందుకే ప్రభుత్వం తనను అణచివేస్తోందని మండిపడ్డారు. శాసనసభ హక్కుల కమిటీ నుంచి పిలుపువస్తుందని ఎదరుచూశానని, కానీ ఇప్పటివరకూ తనను పిలవలేదని ఆమె చెప్పారు. స్వర్గీయ ఎన్‌టిఆర్ సిద్ధాంతాలు, ఆశయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో తూట్లు పొడిచారని, ఎన్‌టిఆర్ కుటుంబాన్ని అన్నివిధాలుగా వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. జూనియర్ ఎన్‌టిఆర్‌ను ఎన్నికల సమయంలో కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుని వదిలేసిన చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసం రాజకీయంగానే కాకూండా జూనియర్ ఎన్‌టిఆర్ సినిమాలకు కూడా అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. టిడిపిని దొంగల పార్టీ2గా ఆమె అభివర్ణించారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ టిడిపి ఎమ్మెల్యే అనితను బలిపశువును చేస్తోందని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, మహిళల కోసమే పోరాడుతున్నానని రోజా పేర్కొంటూ, సుప్రీం కోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు.