రాష్ట్రీయం

బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 29: ఇంతవరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను నిర్వర్తించిన అన్ని బాధ్యతల నుండి తప్పకుంటూ, ఆయా పదవులకు రాజీనామా చేసినట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ లేఖ రాశారు. ఈ మేరకు నెహ్రూ మంగళవారం జగన్‌కు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారు. జగన్‌కు నెహ్రూ రాసిన లేఖలో ‘మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేని కారణంగా పార్టీలో మీరు అప్పగించిన తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, రాష్ట్ర అధికార ప్రతినిధి, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే వైసిపి నుండి జగ్గంపేట శాసన సభ్యుడిగా ఎన్నికైన జ్యోతుల శాసనసభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదు.