రాష్ట్రీయం

శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రికార్డ్ స్థాయిలో విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 29: టిటిడి నిర్వహిస్తున్న అన్నదాన ట్రస్టుకు దాతల నుంచి భూరి విరాళాలు భారీగా అందుతున్నాయి. ఈక్రమంలో 2015-16 సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.104.54 కోట్లు విరాళాలు అందాయి. ఈసందర్భంగా జెఇఒ శ్రీనివాసరాజు మాట్లాడుతూ టిటిడి అన్నదాన ట్రస్టుకు హెచ్‌సిఎల్ అధినేత శివనాడార్ మంగళవారం ఒక కోటి ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చారని అన్నారు. 1985లో దివంగత ఎన్టీ రామారావు ఈ అన్నదాన పథకాన్ని ప్రారంభించారన్నారు. గత 31 సంవత్సరాల్లో 670 కోట్ల రూపాయలు అన్నదానం ట్రస్టుకు నిధులు చేకూరాయన్నారు. తొలిదశలో భక్తులిచ్చిన విరాళాలతోపాటు టిటిడి కూడా అందుకు సరిసమానంగా మ్యాచింగ్ గ్రాంటును బ్యాంకులో జమ చేసేదన్నారు. అయితే గత కొంతకాలంగా భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయన్నారు. అన్నదానం డిప్యూటి ఇఒ వేణుగోపాల్ మాట్లాడుతూ 2012-13 సంవత్సరానికి రూ.50కోట్లు, 2013-14కు రూ.62 కోట్లు, 2014-15కు రూ.82 కోట్లు నిధులు అందాయని, ఈ ఏడాది అదనంగా రూ.19కోట్లు రావడంతో రూ.104కోట్లకు చేరిందని చెప్పారు. తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనంలో రోజుకు 60 నుంచి 70వేల మందికి, క్యూ కాంప్లెక్స్‌లో 30వేల మందికి, తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసంలో 10వేల మందికి, ఇతర ప్రాంతాల్లో మరో 10వేల మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు.టిటిడి అనుబంధ ఆలయాల్లో కూడా అన్నదాన వితరణ చేయాలని టిటిడి యోచిస్తున్నట్లు తెలిపారు.