రాష్ట్రీయం

అసెంబ్లీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 29: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం వెలగపూడిలో ఆరు బ్లాకులతో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐదు బ్లాకుల్లో సెక్రటేరియట్, ఒక బ్లాక్‌లో అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఎట్టకేలకు ఆ నిర్మాణానికి సంబంధించి అనుమతి లభించినట్టు తెలిసింది. దీంతో అసెంబ్లీ భవన నిర్మాణానికి పనులు మొదలు పెట్టబోతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు విజయవాడలో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ భవన నిర్మాణం పూర్తి కాకపోవచ్చని అధికారులు చెపుతున్నారు.
మరోపక్క తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నా, జూన్ నాటికి పూర్తి కావని అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం పునాదుల స్థాయిలోనే నిర్మాణ పనులు ఉన్నాయి. జూన్ నాటికి కేవలం సివిల్ పనులు మాత్రమే పూర్తవుతాయని, పూర్తి స్థాయి భవనం సిద్ధం కాదని సిఆర్‌డిఏ అధికారులు చెపుతున్నారు. ఇదే జరిగితే, జూన్ నాటికి ఉద్యోగులంతా విజయవాడకు వచ్చి ఎక్కడ పనిచేస్తారో అర్థంకావడం లేదు.
ఇదిలా ఉండగా రాజధాని నిర్మాణ పనులను రెండు, మూడు నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అయితే, వచ్చే ఏడాది వరకూ జపాన్‌కు చెందిన మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవచ్చని సిఆర్‌డిఏ అధికారులు చెపుతున్నారు. ఈ సంస్థ ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, మార్పులు, చేర్పులు చేసి, టెండర్లు ఆహ్వానించడానికి కనీసం ఏడెనిమిది నెలలు పడుతుందని అధికారులు చెపుతున్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికి కానీ పనులు ఆరంభం కాకపోవచ్చని చెపుతున్నారు.