ఆంధ్రప్రదేశ్‌

ధనార్జనే లక్ష్యం కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 30: నేడు వైద్యంపై చేయాల్సిన వ్యయం సామాన్యులు భరించలేని స్థాయికి చేరుకుందంటూ రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్లినికల్ పరీక్షల పేరిట వైద్యులు ప్రజలపై మోపుతున్న భారాలే ఇందుకు కారణమన్నారు. అందుకే గుండె, మూత్రపిండాలు, ఇతర వ్యాధులకు సంబంధించిన చికిత్సకు అయ్యే ఖర్చు ప్రతి ఒక్కరికీ తెలిసేలా అన్ని ఆసుపత్రుల్లోనూ ఒకేవిధంగా ధరల పట్టికలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా అత్యున్నత వైద్యసేవలు లభిస్తున్నప్పటికీ మధ్యతరగతి ప్రజలకు ఈ వైద్య సేవలు భారం కాకుండా చూడాల్సిన కనీస బాధ్యత వైద్యులపై ఉందన్నారు. నూతనంగా వైద్య వృత్తిలోకి వస్తున్న యువకులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వైద్యం సకాలంలో అందించడానికై తరలివెళ్లాలంటూ గవర్నర్ పిలుపునిచ్చారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 18వ, 19వ స్నాతకోత్సవం బుధవారం నాడిక్కడ ఎ కనె్వన్షన్ ఫంక్షన్ హాలులో జరిగింది. గవర్నర్ చాన్సలర్ హోదాలో కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ప్రస్తుతం అందుతున్న వైద్యసేవల పట్ల సాధారణ ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడగల్గే శక్తి కేవలం వైద్యులకే ఉందనేది అక్షర సత్యమన్నారు. అయితే ఈ క్రమంలో వైద్యులు కేవలం ధనార్జన లక్ష్యంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారని అందుకే ఈ వదంతులకు స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైద్య సేవలందించడంలో మానవ సంబంధాలు హరించి చాలా కాలం గడుస్తోందని, ఈ పరిణామాలను సాధారణ ప్రజలు ఇక భరించే స్థితిలో లేరంటూ గవర్నర్ సున్నితంగా హెచ్చరించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కిర్పార్ సింగ్ చుగ్ సూచించిన విధంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన నిజాయితీతో వైద్య సేవలు అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఈ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ స్వీకరించిన ప్రపంచ ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిర్పాల్ సింగ్ మాట్లాడుతూ వైద్యులు తమ పరిజ్ఞానాన్ని, వివేకాన్ని జోడించి పనిచేయాలంటూ పిలుపునిచ్చారు.రోగులకు చికిత్స అందించే సందర్భంలో మానవీయ, వివేకవంతమైన విధానాన్ని అనుసరించాలన్నారు. డయాలసిస్, ఓపెన్ హార్ట్ సర్జరీ, లుకోమియా చికిత్సకు ఎముక మజ్జలోని స్టెమ్ కణాల చికిత్స, కేన్సర్ వంటి ఆధునిక చికిత్స విధానాలు ప్రజల జీవితకాలాన్ని పెంచుతున్నాయన్నారు. అయితే ఇవన్నీ సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ దేశం యువ వైద్యుల నుంచి అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను కోరుకుంటుందన్నారు. విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ టి రవిరాజు తన ప్రారంభోపన్యాసంలో విశ్వవిద్యాలయం స్థాపించిన 30 ఏళ్ల కాలంలో 410 వైద్య కళాశాలలకు అనుబంధమయ్యాయని, ప్రతి ఏటా 27 వేల 670 మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ప్రధానంగా జీవన్ దాన్ పథకం ద్వారా కిడ్ని, లివర్, లంగ్స్ వంటి 160 అవయవాలు ఇప్పటికి దానం చేయడం జరిగిందన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేబరెటరీలు, సమగ్ర పరిశోధన సదుపాయాలతో కూడిన ప్రాంగణం ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా వివిధ దాతలు అందించిన బహుమతులను 42 మందికి గవర్నర్ అందజేశారు.