ఆంధ్రప్రదేశ్‌

ఓడిపోయిన టిడిపి నేతలకు.. ‘అభివృద్ధి’ నిధులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: కావల్సిన వారికే నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చుకుంటారా అని వైకాపా శాసనసభ్యులు బుధవారం ఎపి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ వైఖరిని విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. అనంతరం వైకాపా సభ్యులు శాసనసభ నుండి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, బి రాజశేఖరరెడ్డి, కోన రఘుపతి తదితరులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చినపుడు ఈ అంశంపై శాసనసభలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఇవ్వడం లేదని, ప్రత్యేక అభివృద్ధి నిధులను మాత్రమే ఇస్తోందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శాసనసభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధులు గత ఏడాది ఇవ్వలేదని, ఈ ఏడాది కూడా ఇవ్వలేదని, వచ్చే ఏడాది కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద దాదాపు 500 కోట్లు కేటాయించామని, అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి ఆధీనంలో ఈ నిధులు ఉన్నాయని, ఎవరికైనా సమస్యలు వచ్చినపుడు వారు చేసిన విజ్ఞప్తిని పరిశీలించి ఆ నిధులను కేటాయించడం జరుగుతుందని వివరించారు. అభివృద్ధి పనుల కోసం రాష్ట్రంలో అవసరత ఆవశ్యకత ఆధారంగా ముఖ్యమంత్రి దీనిని నిర్ణయిస్తారని చెప్పారు. 74 మంది ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలకు రెండు కోట్లు చొప్పున నిధులను విడుదల చేశారని, ఇతరులకు 54.50 కోట్లు మొత్తాన్ని కేటాయించారని యనమల చెప్పారు. ప్రత్యేక అభివృద్ధికి నిధులు ఎవరు అడిగినా ఇస్తున్నామని యనమల స్పష్టం చేశారు.
నిధుల కేటాయింపుపై చర్చ జరగాలని వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. ఎస్‌డిఎఫ్ పేరుతో టిడిపి నుండి ఓడిపోయిన నేతలకు, ఆ పార్టీ ఇన్‌చార్జిలకు నిధులు కేటాయించారని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా టిడిపి నేతలకు నిధులు మంజూరు చేస్తున్నారని రాజేంద్రనాధ్‌రెడ్డి ఆరోపించారు. టిడిపి నేతలు కందుల నారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరుతో ప్రభుత్వం ఎస్‌డిఎఫ్ నిధులను కేటాయించిన విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి సభలో ప్రస్తావించారు. ప్రభుత్వ విధానంపై వైకాపా సభ్యులు తీవ్ర స్థాయిలో నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం: జగన్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవాస్తవాలు చెప్పి శాసనసభను తప్పుదోవ పట్టించారని జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీలో లేబర్ కాంపొనెంట్ 60 శాతం అని ఉన్నా దానిని పెంచేందుకు ఎలాంటి పరిమితులు లేవని, అయితే మెటీరియల్ కాంపొనెంట్ మాత్రం 40 శాతానికి మించరాదనేని చట్టంలోని నిబంధనన అని వివరించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 97.54 శాతం వరకూ లేబర్ కాంపొనెంట్ కింద ఖర్చుచేశారని గుర్తుచేశారు.