ఆంధ్రప్రదేశ్‌

బోసిపోయిన బ్రహ్మంసాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, మార్చి 30 : తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కడప జిల్లా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీరు అడుగంటిపోయింది. ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న కుడి, ఎడమ తూములకు చాలా రోజులుగా నీరు లేదు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్ల ద్వారా తోడుతూ ఏరోజుకారోజు గడిపేస్తున్నారు. ప్రాజెక్టు కింద 1.53 లక్షల ఎకరాలకు సాగునీరు దేవుడెరుక కనీసం తాగునీటికైనా దిక్కులేని పరిస్థితి నెలకొంది. 2006 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత వైఎస్ హయాంలోనే ఒకమారు 13 టిఎంసిల నీటిని నింపారు. మరోమారు రెండుమూడు టిఎంసిల నీటిని నింపి పాలకులు, అధికారులు చేతులు దులుపుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు వచ్చినా బ్రహ్మంసాగర్‌ను నీటితో నింపిన దాఖలాలు లేవు. గత రెండు, మూడేళ్లుగా కేవలం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్‌టిపిపి)కు మాత్రం నీరు ఆపకుండా ఇస్తూ ఎలాగోలా తంటాలు పడుతున్నారు. ఈ ప్రాజెక్టులో ఇరిగేషన్ అధికారులు కనీస నీటిమట్టాన్ని అమలుచేస్తే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి తద్వారా రైతులు బోర్ల ద్వారానైనా పంటలు పండించుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. ఉన్న అరకొర నీటిని ఆర్టీపీపీ అవసరాలకు మోటర్ల ద్వారా పంపిస్తున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు చుట్టూ రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో వుండే గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాధికారులు గంగిరెడ్డిపల్లె, నర్సిరెడ్డిపల్లె, తోట్లపల్లె, లింగాలదినె్నపల్లె, ఎద్దులాయపల్లె, చెంచయ్యగారిపల్లె తదితర గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా ఉదయం, సాయంత్రం నీరు సరఫరా చేస్తున్నారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు అనుబంధంగా మంచినీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామాలకు పైపులైన్లు కూడా ఏర్పాటు చేశారు, కానీ నీటిని మాత్రం అందించలేకపోవడంతో అలంకారప్రాయంగా మిగిలాయి. అలాగే నాబార్డు నిధులతో బద్వేలు మున్సిపాలిటీతో పాటు ఇతర ప్రాంతాలకు సైతం బ్రహ్మంసాగర్ నుంచి నీరు సరఫరా చేయాలని కోట్లాది రూపాయలు వెచ్చించి మరో ప్లాంట్ నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన పైపులైన్ తదితర పనులు పూర్తయినప్పటికీ నీరుమాత్రం అందుబాటులో లేదు. ముందుజాగ్రత్త చర్యగా బ్రహ్మంసాగర్‌లో కనీసం 4 టిఎంసిల నీటిని నిల్వ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. బ్రహ్మంసాగర్‌లో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో బ్రహ్మంగారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఈ ప్రాజెక్టును సందర్శించి ఆహ్లాదంగా గడిపేవారు. అప్పట్లో బ్రహ్మంసాగర్ ప్రాంతమంతా సందర్శకులతో కళకళలాడటమే కాకుండా ఏపి టూరిజం నిర్వహిస్తున్న బోటు షికారుకు కూడా మంచి స్పందన ఉండేది. ప్రస్తుతం బ్రహ్మంసాగర్‌లో నీరు లేక బోసిపోవడంతో యాత్రికులు సైతం నిరాశతో వెనుదిరుగుతున్నారు.

సింహాచల దేవస్థానం ధర్మకర్తగా అశోక గజపతిరాజు

సింహాచలం, మార్చి 30: శతాబ్దాల చరిత్ర కలిగిన విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయ అనువంశిక ధర్మకర్తగా కేంద్రమంత్రి పూసపాటి అశోక గజపతిరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అంశానికి సంబంధించి తన తదనంతరం సోదరుడు అశోక గజపతిరాజుకు బాధ్యతలు అప్పగించాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఆనందగజపతిరాజు ఇది వరకే లేఖ రాసినట్లు సమాచారం. ఆనంద గజపతిరాజు ఇటీవల కాలధర్మం చెందిన నేపధ్యంలో అశోక్‌తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

చందనయాత్రకు పట్టువస్త్రాలు తీసుకొస్తున్న అశోక గజపతిరాజు (పాతచిత్రం)

వైరస్‌గా మారిపోయన బెట్టింగ్‌లు

ఏలూరు, మార్చి 30: అంతటా ఉత్సాహం... అంతకుమించిన ఉద్వేగం... అభిమాన క్రికెటర్ ఈసారి ఏ రికార్డు సాధిస్తాడోనన్న ఉత్కంఠ...ఇవన్నీ సాధారణ క్రీడాభిమాని అనుభవాల కింద చెప్పుకోవచ్చు. కానీ దీనివెనుక సమాజానికి అందకుండా అండర్‌గ్రౌండ్‌లో భారీఎత్తున బెట్టింగుల వ్యవహారం నడిచిపోతోంది. క్రికెట్ బెట్టింగ్ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను కుదిపేస్తోంది. యువతరం జీవితాలను ఛిద్రం చేస్తోంది. వారి భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో సందుసందునా, వీధివీధినా ఈ బెట్టింగ్ వీరులు దర్శనమిస్తూనే ఉంటారు.కాసిన పందాలకు నగదు చెల్లించలేక, బుకీల వేధింపులు తట్టుకోలేక రాత్రికి రాత్రి పరారవుతున్నారు. కొన్ని కుటుంబాలకు కుటుంబాలే మాయమైపోతున్నాయి. బుకీల వత్తిళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. యువతరంలో బెట్టింగ్ వ్యవహారం వైరస్ మాదిరిగా పాకిపోయింది. పలు కళాశాలల్లో బెట్టింగ్ చేస్తున్న యువతరమే దర్శనమిస్తుందంటే ఆతిశయోక్తి కాదు. ఇక చేసేదిలేక దొంగతనాలు చేస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా దొంగతనాల కేసుల్లో పోలీసులు పట్టుకున్నవారిలో సంప్రదాయక దొంగలు కాకుండా ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్లు, ఇతరత్రా ఉన్నత చదువులు చదువుతున్నవారే ఉండటం గమనార్హం. పోలీసుల పర్యవేక్షణ, నియంత్రణ లేనంతకాలం ఈ వ్యవహారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతూనే ఉంటుందని చెప్పాలి. తాజాగా ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీలు అనుకున్న స్ధాయి కన్నా ఉత్కంఠభరితంగాను, తీవ్ర ఆసక్తిని రేపే విధంగాను సాగుతున్నాయనే చెప్పాలి. సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవటంలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన పోటీ అటు బెట్టర్లను, ఇటు బుకీలను కూడా కుదిపేసిందనే చెప్పాలి. చివరి నిముషం వరకు ఇండియా గెలిచే అవకాశాలపై పెద్దఎత్తున అనుమానాలు కొనసాగుతూనే ఉన్నా చివరిలో విరాట్‌కోహ్లీ పెద్దఎత్తున బ్యాట్ ఝళిపించటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి గెలుపు ముంగిట ఇండియా నిలబడిపోయింది. ఈసమయంలోనే అత్యధికంగా బెట్టర్లు దెబ్బతిన్నట్లు సమాచారం. అంతకుముందు ఇండియా ఖాయంగా ఓడిపోతుందన్న సమయంలో చాలామంది ఆస్ట్రేలియా వైపు పెద్దఎత్తున బెట్టింగ్‌లు కాసేశారు. అయితే కోహ్లీ విరుచుకుపడిన సమయంలో ఆ బెట్టింగ్‌లను తిప్పేందుకు ప్రయత్నించినా బుకీల ఫోన్లు స్పందించకపోవటంతో వారంతా గగ్గోలు పెట్టారు. చివరకు ఆ మొత్తాలు చెల్లించలేక చాలామంది మునిగిపోయారు.