ఆంధ్రప్రదేశ్‌

జీవో 279ని సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 30: రాష్ట్రంలోని కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలలో పనిచేస్తున్న దాదాపు 45 వేల మంది కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను తొలగించేందుకై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 279ని కార్మికులకు అనుకూలంగా తక్షణం సవరించాలంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసి పిలుపు మేరకు బుధవారం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది కార్మికులు నగర వీధులలో కదం తొక్కారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య వీరంతా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ మీదుగా అలంకార్ సెంటర్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎఐటియుసి, రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్.రవీంద్రనాధ్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌ఎ గఫూర్, , వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతంరెడ్డి, ఎఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు, సిఐటియు అనుబంధ మున్సిపల్ ఎంప్లారుూస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కార్మికులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించే విధానాన్ని ఎత్తివేసి పనినిన ఏకంగా ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేందుకై గత డిసెంబర్ 30న జారీ చేసిన జీవో 279ను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించడం దారుణమన్నారు.
ముగిసిన సోమయాజులు కమిషన్ గడువు
రాజమహేంద్రవరం, మార్చి 30: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ గడువు మంగళవారంతో ముగిసింది. కమిషన్ గడువు ముగిసినా ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈనెల 29వ తేదీలోగా అన్ని శాఖల నివేదికలను క్రోడీకరించి, అఫిడవిట్ దాఖలు చేస్తామని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పినా ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుకు జిఓ జారీచేసింది. అదే నెల 29న జస్టిస్ సోమయాజులు బాధ్యతలు స్వీకరించారు. జనవరి 1న, ఫిబ్రవరి 23న, ఈ నెల 21న కమిషన్ రాజమహేంద్రవరంలో విచారణ నిర్వహించింది. తొలి విచారణకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మాత్రమే అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. 2వ సారి విచారణ నాటికి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు, వామపక్షాలు, వివిధ వ్యక్తులు 26 మంది కమిషన్ ముందు హాజరై అఫిడవిట్లు దాఖలుచేశారు. ఈ నెల 19వ తేదీ నాటికి ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉండగా, గడువు ముగిసినా దాఖలు చేయకపోవడం గమనార్హం.
ప్రకాశం జిల్లాలో విద్యార్థినిపై అత్యాచారం
కారంచేడు, మార్చి 30: ప్రకాశం జిల్లా కారంచేడు మండల కేంద్రానికి వచ్చి టెన్త్‌పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న బాలికపై మండలంలోని కొడవలివారిపాలెంకు చెందిన యువకుడు అత్యాచారం చేశాడు.ఎఎస్సై తెలిపిన వివరాల మేరకు కొడవలివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పదోతరగతి చదువుతున్న విద్యార్థిని మండల కేంద్రమైన కారంచేడు ఉన్నత పాఠశాలలో మంగళవారం లెక్కలు-1 పరీక్ష రాసేందుకు వెళ్లి పరీక్ష రాసిన అనంతరం పరీక్ష హాలు బయటకు వచ్చింది. ఈ సమయంలో అదే కాలనీకి విద్యార్థిని ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న తలతోటి ప్రసాద్ పాఠశాలలో ఉన్న విద్యార్థిని వద్దకు వచ్చి మీ అమ్మా నాన్నలు గొడవపడుతున్నారని, మీ బంధువులు నిన్ను త్వరగా పిలుచుకు రమ్మన్నారని బైకు ఇచ్చి పంపించారంటూ నమ్మ బలికి విద్యార్థిని ఎక్కించుకుని కొడవలివారిపాలెం గ్రామ సమీపంలో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అరకులో మండుటెండలో భారీ వర్షం
అరకులోయ, మార్చి 30: విశాఖ జిల్లా అరకులోయ పరిసర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా గంటకు పైగా ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో జనం పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండ, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీవర్షంతో ఉపసమనం పొందారు. గత కొన్ని రోజులుగా భగభగమంటున్న సూర్యభగవానుడి ప్రతాపాన్ని తట్టుకోలేని ప్రజలు భారీ వర్షంతో ఊరట చెందారు. అదేవిధంగా అనంతగిరిలో వడగళ్ల వాన కురిసింది.
నిత్యాన్నదాన పథకానికి రూ.50లక్షలు విరాళం
తిరుమల, మార్చి 30: టిటిడి నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి బుధవారం ఓ భక్తుడు రూ.50లక్షలు విరాళంగా అందజేశారు. సింగపూర్‌కు చెందిన సినర్జీ రీసోర్సస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు రూ.50 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో టిటిడి విరాళాల విభాగాధిపతి రాజేంద్రుడుకి తిరుమల్లోని ఆయన కార్యాలయంలో అందజేశారు.