రాష్ట్రీయం

తెలుగు వైభవానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రాచీన వైభవం, అధునాతన సాంఘిక అంశాల మేళవింపుతో రాజధాని అమరావతిలో వెల్‌కమ్ గ్యాలరీ రూపుదిద్దుకోనుంది. వాణిజ్య, సమాజ అభివృద్ధి కేంద్రంగా ఈ గ్యాలరీ ఉంటుంది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే గ్యాలరీ, రాజధానిలో అభివృద్ధిని ఉత్తేజితం చేసేలా ఉంటుంది. సామాజిక కార్యకలాపాలు, వాణిజ్యం, భాగస్వామ్యాలకు మూల కేంద్రంగా ఉంటుంది. ప్రాచీన తెలుగు సంస్కృతి విశిష్టతను, 2300 సంవత్సరాల క్రితం తెలుగు జాతి వైభవాన్ని, స్మృతులను, గుర్తింపును ఈ గ్యాలరీ ప్రతిబింబిస్తుంది. అమరావతి నగర గత వైభవాల వారసత్వ సంపదను స్ఫురణకు తేవడమే కాకుండా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ గ్యాలరీ డిజైన్ ఉంటుంది. ప్రాచీన పురావస్తు స్మృతి చిహ్నాలతో పాటు ప్రస్తుత అధునాతన సాంఘిక అంశాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతారు. ఎటు చూసినా పూర్తి పచ్చదనం నిండిన పరిసరాల మధ్య 4800 చదరపు కిలోమీటర్ల బిల్డప్ ఏరియాలో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని, ఇక్కడి ప్రజల సంస్కృతిని గుర్తు చేసేలా క్యాపిటల్ సిటీ మోడల్ ప్రతిబింబిస్తుంది. కళలు, వినూత్న సాంకేతికత, అర్బన్ సొల్యూషన్లను తెలియచేస్తుంది. కనె్వన్షన్ సెంటర్లు, రిక్రియేషన్ జోన్స్, హెల్త్ క్వార్టర్లు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ఏరియాలో ఉంటాయి. రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌లను ప్రొత్సహించే విధంగా కో-వర్కింగ్ స్పేసెస్ ఉంటాయి. వాణిజ్య ప్రోత్సాహక వేదికగా ఈ వెల్‌కమ్ సెంటర్ ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు, ప్రదర్శనలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అనువుగా ఉంటుంది. సందర్శకులకు అందరికీ వన్‌స్టాప్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. వివిధ కంపెనీల అంతర్జాతీయ సుస్థిర అర్బన్ సొల్యూషన్స్ ప్రచారానికి మూల కేంద్రం అవుతుంది. 2019 అక్టోబర్ చివరి నాటికి ఈ గ్యాలరీ పని చేయడం ప్రారంభిస్తుంది. ఈ గ్యాలరీ సామర్థ్యం రోజుకు 3000 మంది సందర్శకుల వరకూ ఉంటుంది. భవిష్యత్తులో పలు అంతర్జాతీయ ఒప్పందాలకు ఈ గ్యాలరీ గమ్యస్థానం కానుంది. ఈ లక్ష్యంలో భాగంగా అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్ ఇప్పటికే పార్టనర్‌షిప్ ప్రోగ్రామ్ చేపట్టింది. స్టార్టప్స్‌ను, మార్కెట్ లీడర్స్‌ను, అకడమిక్ ఇన్‌ఫ్లుయన్నర్స్‌ను ఒక చోటకు తెచ్చింది. స్మార్ట్ బిల్డింగ్, స్మార్ట్ ఎన్విరాన్‌మెంట్, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ కొలాబరేషన్స్ వంటి నాలుగు కీలక ప్రాంతాల్లో వీరిని భాగస్వాములను చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దీనిని అద్భుతమైన స్పందన లభించింది. జర్మనీ, జపాన్, సింగపూర్, భారత్ నుంచి 15 కంపెనీలు అవగాహనా ఒప్పందాలను ఏడీపీతో చేసుకున్నాయి.