రాష్ట్రీయం

ఆర్టీజీఎస్ పనితీరు స్ఫూర్తిదాయకం: ఈశ్వరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10: వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరు స్ఫూర్తిదాయకమని సింగపూర్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఈశ్వరన్ కితాబిచ్చారు. ఆర్టీజీఎస్ స్టేట్ కమాండ్ సెంటర్‌ను ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గురువారం సందర్శించారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి సీఈవో బాబు వివరించారు. ఇటీవల వచ్చిన తిత్లీ తుపాను గమనాన్ని, తుపాను అనంతర సహాయక చర్యలను ఇక్కడి నుంచే పర్యవేక్షించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రగతికి దోహదపడే మంచి సాధనమని ఈశ్వరన్ అన్నారు.

చిత్రం..వెల్‌కం గ్యాలరీ నమూనాలు చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్