రాష్ట్రీయం

ఒక్కరోజే లక్ష కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, వెనుకబడిన జిల్లాల్లో సంపద సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. జన్మభూమి - మా ఊరు 9వ రోజుపై జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. బుధవారం ఒక్కరోజే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నామన్నారు. 1.26 లక్షల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నానయని వెల్లడించారు. విశాఖలో డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు ఏర్పాటు కానున్నాయన్నారు. 30 వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ పార్కులు, 40 వేల కోట్ల రూపాయలతో సోలార్ పార్కులు రానున్నాయని, దీంతో వర్జీనియాకు దీటుగా విశాఖ మారుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 24,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆసియా పల్ప్ అండ్ పేపరు మిల్లు
రానుందన్నారు. ప్రత్యక్షంగా 4500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. 50 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రామాయపట్నం పోర్టు, భావనపాడు పోర్టుల ఏర్పాటుతో లాజిస్టిక్ హబ్‌గా ఏపీ కానుందన్నారు. ఆదాని గ్రూపుతో ఒప్పందం చేసుకున్నామని, 70 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించాలన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతంలో కన్నా ఈ జన్నభూమిలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. శే్వతపత్రాలపై చర్చ జరపాలని సూచించారు. పాఠశాలల ప్రహరీల నిర్మాణంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఇళ్ల కోసం వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళిక కీలకమని, దీనిని పటిష్టంగా రూపొందించాలన్నారు. గ్రామసభల్లో సమగ్ర చర్చ జరగాలని సూచించారు. జన్మభూమిలో సంక్రాంతి సంబరాలు, ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలను నిర్వహించాలన్నారు.
రాజధాని అమరావతిలో వెల్‌కమ్ గ్యాలరీకి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. స్వల్పకాలంలోనే ఏ విధంగా సింగపూర్ అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందేనన్నారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ఇస్తున్న సహకారం మరచిపోలేమన్నారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. 48 వేల కోట్లతో రాజధానిలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సింగపూర్ తరహా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని, ఆ మాటను నిలబెట్టుకుంటున్నానని తెలిపారు.నైపుణ్యాభివృద్ధిలో, పరిపాలనలో సింగపూర్ సహకారానికి ధన్యవాదాలన్నారు. లీక్వాన్ వర్సిటీ రేటింగ్‌లో ఏపీ అగ్రగామిగా వచ్చిందని గుర్తు చేశారు. ఒక అద్భుత సమయంలో, స్ఫూర్తిదాయకమైన కాలంలో మనం ఉన్నామన్నారు. రాజధాని నిర్మాణం అనే అద్భుత అవకాశం మనకు వచ్చిందని, ఇదొక అరుదైన అవకాశంగా అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని నిర్మించుకుంటున్నామన్నారు. మన రాజధాని ప్రపంచంలో 5వ అత్యున్నత నగరం కావాలని ఆకాంక్షించారు. అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీని చేస్తున్నామని, ఇప్పటికే అవినీతి రహిత రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉన్నామన్నారు. సాంకేతికత ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఏపీ ఇప్పటికే అనేక రాష్ట్రాలకు నమూనాగా మారిందన్నారు. త్వరలో ప్రపంచానికే నమూనా కానుందన్నారు. కృష్ణా నది ఒడ్డున రాష్ట్రానికి నడిబొడ్డున రాజధానిని నిర్మిస్తున్నామని, నదుల అనుసంధానం చేశామన్నారు. నీటి భద్రత ఇచ్చామని, పంచ నదుల మహా సంగమం చేస్తున్నామన్నారు.