రాష్ట్రీయం

ప్రయాణికులకు వినోదంపై రైల్వే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 10: రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇక నుంచి వినోదాన్ని పొందనున్నారు. వెళ్లాల్సిన రైలు కోసం నిరీక్షించే ప్రయాణికులకు విసుగెత్తకుండా కాస్తంత వినోదాన్ని పొందే విధంగా రైల్వే పలు ఆకర్షణీయమైన పథకాలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దేశంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో బాడీ మాస్ ఇండెక్స్ మెషిన్స్ (బిఎంఐ కియోస్క్), వర్క్‌షాపులు, మైక్రో స్మార్ట్ స్టే లాంజ్ (3డి), ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, హెరిటేజ్ కేఫ్, హెల్త్ ఏటీఎం, జింగల్స్, మొబైల్ ఫుడ్‌కోర్టులు ఏర్పాటు కానున్నాయి. వీటిని కార్పొరేట్ సంస్థలతో నిర్వహించాలని, రెండేళ్ళపాటు నడిపే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని రైల్వే నిర్ణయించింది. భారతీయ రైల్వే పరిధిలో ముఖ్యమైన, ఏ-1 క్యాటగిరీ రైల్వే స్టేషన్లలోప్రయోగాత్మకంగా ఇటువంటి సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఇటువంటి సరికొత్త ఆకర్షణీయమైన పథకాల ద్వారా ప్రయాణికులకు మరింత చేరువకావడం, అదే క్రమంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందనేది రైల్వే ఆలోచన. ప్రధానంగా నిరుపయోగంగా, ఎటువంటి అభివృద్ధికి నోచుకోని రైల్వేస్టేషన్ల బయట, పరిసరాలు, లోపలి భాగాల్లో ఖాళీ స్థలాలు, వాణిజ్య సముదాయాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రైల్వేజోన్లతోపాటు ముఖ్యమైన ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ జోన్‌లో ఉన్న వాల్తేర్, సంబల్‌పూర్, ఖుర్దా డివిజన్లకు సంబంధించి ఒక్క వాల్తేరుకు మాత్రమే దీనికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎనిమిది ప్లాట్‌ఫారాలున్న విశాఖ రైల్వే స్టేషన్‌లో రైల్వేకు చెందిన ఖాళీ స్థలాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వీటిని అనేక రకాలుగా ఉపయోగించుకునేందుకు అవకాశాలున్నందున ఈ పథకాలను అమలు చేసేందుకు వాల్తేర్ డివిజన్ ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో ఓ ప్రకటన చేయాలని నిర్ణయించగా, ఈ నెలాఖరులోపు ఆసక్తి కలిగి ఉండే వారంతా ముందుకు రావచ్చని కూడా డివిజన్ పేర్కొంది. రైల్వే యూజర్స్ గేమింగ్ జోన్ థియేటర్ (ఎమ్యూజ్‌మెంట్), అత్యాధునిక ప్రాజెక్టులు, (ఇన్నోవేటివ్), ప్రయాణికులను ఆకర్షించే మరికొన్నింటిని కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించనుంది. వీటిపట్ల చూపే శ్రద్ధ, విజయవంతమయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో శాశ్వత ప్రాతిపదికన నిర్వహించుకునేందుకు అవకాశాలు కల్పించాలని కూడా వాల్తేరుడివిజన్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఒక్క టికెట్ల ద్వారానే కాకుండా ప్రయాణికులకు వినోదాన్ని అందించడం ద్వారా మరికొంత అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు అవుతుందని భావిస్తున్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలోనే రైల్వే సొంత స్థలాలు ఉండటంతో వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగపర్చుకోవాలని నిర్ణయించిన రైల్వేజోన్ ఇపుడు వీటిని గుర్తించడంపై దృష్టి సారిస్తోంది. గేమింగ్ జోన్ల కోసం ఆర్‌పీఎఫ్ గ్రౌండ్స్‌ను, ప్లాట్‌ఫారం-1, సెంట్రల్ ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న రిటైరింగ్ రూమ్‌లు, డార్మెటరీలు, జ్ఞానాపురం రైల్వేస్టేషన్ మార్గంలో ఉన్న ఖాళీ స్థలాల్లో వినోదాన్ని అందించే ఏర్పాట్ల కోసం పరిశీలిస్తోంది.