రాష్ట్రీయం

వృద్ధుల ఔదార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా అప్పజెప్పడానికి యాదాద్రికి చెందిన వృద్ధ దంపతులు ముందుకు వచ్చారు. వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ దంపతులు గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును కలిసి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. వృద్ధ దంపతుల దాతృత్వం, సేవా దృక్పథాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశంసించారు. యాదాద్రి జిల్లా అధికారులతో మాట్లాడి వృద్ధాశ్రమం కొనసాగేలా సహకారం అందించనున్నట్టు వారికి కేటీఆర్ హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొండూరు గ్రామంలో మేరెడ్డి సత్యనారాయణరెడ్డి జానకమ్మ దంపతులు కోటి రూపాయల వ్యయంతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎకరంన్నర విస్తీర్ణంలో ఆరు వేల చదరపు అడుగుల భవనాన్ని వీరు తమ సొంత డబ్బులతో నిర్మించారు. అనారోగ్యం కారణంగా భవిష్యత్‌లో వృద్ధాశ్రమాన్ని కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చని భావించి దీనిని ప్రభుత్వానికి విరాళంగా అప్పగించాలని నిర్ణయించినట్టు వారు కేటీఆర్‌కు వివరించారు. ప్రభుత్వమే ఈ వృద్ధాశ్రమాన్ని స్వాధీనం చేసుకొని కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ వెంటనే స్పందించి యాదాద్రి కలెక్టర్ అనితా శ్రీనివాసన్‌తో మాట్లాడారు. సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

చిత్రం..తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ దంపతులు