ఆంధ్రప్రదేశ్‌

మహానగరంలో మాయగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 30: తనతో పరిచయమున్న ఓ మహిళ నగ్న చిత్రాల్ని ఫోన్‌లో తీసి ఆమెను మూడేళ్ల పాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆమె నుండి రూ.6 లక్షల్ని కాజేసిన కేటుగాడి గురించి ఎట్టకేలకు ఆ మహిళ బయటపెట్టింది.మాయమాటల్తో ఆ మహిళను బుట్టలో వేసుకుని నరకాన్ని చూపించిన ఆ నయవంచకుడిని విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కృష్ణలంకకు చెందిన మండవ రవికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి వివాహమైంది.
ఇతని భార్య చెల్లెలు శ్రీదేవికి కూడా వివాహమై భర్త నుండి విడాకులు పొందింది. అప్పటి నుండి ఈమె రామలింగేశ్వరపేటలో నివాసముండటంతో మాయమాటలు చెప్పిన సహజీవనం చేస్తున్నాడు. ఇదే క్రమంలో శ్రీదేవి ఇంటికి సమీపంలో ఉంటున్న మరో మహిళ (39)తో పరిచయం ఏర్పడింది. ఈమె కూడా భర్త నుంచి విడాకులు పొందింది. ఆ మహిళతో చనువు పెంచుకుని మాయమాటలు చెప్పి ఈమెతో రహస్యంగా ‘గడిపిన’ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో బంధించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. డబ్బులు అవసరమైనప్పడల్లా ఆ మహిళ నగ్న చిత్రాల్ని చూపించి బెదిరించి రూ.6లక్షల లాగేశాడు. మానసికంగా తీవ్ర వేదనకు గురైన ఆమె విడాకులిచ్చిన తన భర్త చెంతకు తిరిగి వెళ్దామని ప్రయత్నించగా రవికాంత్ ఆమె నగ్న చిత్రాల్ని భర్తకు సైతం చూపించి ఆ మహిళ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. ఇక వేధింపులకు తాళలేని ఆ మహిళ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భద్రతా సిబ్బంది అతి
షార్‌లో ఉద్యోగుల నిరసన
సూళ్లూరుపేట, మార్చి 30: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ వద్ద భద్రతా సిబ్బంది అతిగా ప్రవర్తించడంతో ఉద్యోగులు మనస్తాపానికి గురై కొద్దిసేపు ఆందోళనకు దిగారు. షార్ కంట్రోలర్ రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఉద్యోగులు షార్ ఏర్పాటుచేసిన బస్సుల్లోనే విధులకు హాజరవుతారు. షార్ రెండో గేటు వద్ద ఉద్యోగులను తనిఖీ చేస్తుండగా టిఫిన్ బ్యాగులు కూడా తనిఖీ చేయాలని వాదించడంతో ఉద్యోగులను కూడా తనిఖీ పేరుతో వేధిస్తారా, అయినా విధులు ముగించుకుని వెళ్లేటప్పుడుకదా తనిఖీ చేసేది అంటూ వాదనకు దిగారు. ఈలోగా కమాండెంట్ అక్కడికి చేరుకుని తనసెల్‌ఫోన్‌లో ఉద్యోగుల నిరసన దృశ్యాలను చిత్రీకరిస్తుండగా సెల్‌ఫోన్‌ను లాక్కోడానికి ఉద్యోగులు ప్రయత్నించారు.

హోదా ఇవ్వకపోతే ప్రభుత్వాలు పతనమే!
ఒంగోలు అర్బన్, మార్చి 30: ఎలాంటి చట్టాలు, బిల్లులు ప్రవేశపెట్టకుండానే కేబినేట్ నిర్ణయం ప్రకారం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని కేంద్ర,రాష్ట్ర మాజీమంత్రులు పనబాక లక్ష్మి, సాకె శైలజానాథ్, రాజ్యసభ సభ్యులు జెడి శీలం ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం ఒంగోలులోని జిల్లాకాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండుసంవత్సరాలు పూర్తికావస్తున్నా ఇంతవరకు ప్రత్యేకహోదా కల్పించలేదని, ప్రత్యేకహోదా కల్పించకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని హెచ్చరించారు. త్వరలో జరిగే మంత్రివర్గవిస్తరణలో ఎస్‌టి,మైనార్టీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాజధాని ప్రాంతంలో పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతంలో ఒక నగరానికి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలన్నారు.