రాష్ట్రీయం

వ్యవస్థల బలోపేతమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): మద్యం బాటిళ్ల కోసమో... బిర్యానీ ప్యాకెట్ల కోసమో...డబ్బు కోసమో...పదవులను ఆశించో తన దగ్గరకు జనసైనికులు రావడం లేదని, సంకల్ప బలం...గుండెల నిండా అభిమానంతో స్వచ్ఛందంగా తనతో కలసి అడుగులు వేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పవన్ కళ్యాణ్ జిల్లాల వారీ సమీక్షలో భాగంగా కడప, గుంటూరు పార్టీనేతలు శ్రేణులు కార్యకర్తలతో భేటీ అయిన ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వీర్యం అయిన వ్యవస్థలను దృఢమైన భావజాలంతో బలోపేతం చేసేందుకే జనసేన ఆవిర్భవించిందన్నారు. ఏపీ రాజకీయాలు కొన్ని కుటుంబాల కబంధహస్తాల్లో చిక్కుకున్నాయన్నారు. కులాల మధ్య ఐక్యత లేకపోతే సమాజ మనుగడ కష్టసాధ్యమన్నారు. రాజకీయాలను డబ్బే శాసిస్తున్న నేటి రోజుల్లో ఆధిపత్య రాజకీయం కోసం కాకుండా బలమైన మార్పు కోసం జనసేన పని చేస్తుందన్నారు. గెలిచినా...గెలవకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం బలమైన పోటీ జనసేన ఇవ్వబోతుందన్నారు. రాష్ట్ర విభజన కోసం విపరీతమైన పోరాటం జరుగుతున్న సమయంలో ఆ పోరాట ఒత్తిడిని తట్టుకునే నాయకుడు ఏపీలో లేకుండా పోయారన్నారు. రాజకీయ సంకల్పం బలంగా ఉన్న ఇందిరాగాంధీ వంటి నేతలు ఎటువంటి ఒత్తిడిని అయినా అవలీలగా తట్టుకునే వారని, నాడు ఎన్ని ఒత్తిడులు వచ్చినా సిద్ధాంతానికి అనుగుణంగా రాష్ట్రాన్ని విభజించేందుకు ఆమె అంగీకరించలేదని గుర్తు చేశారు. అటువంటి నేతలు నేటి రోజుల్లో కనుమరుగైపోయారన్నారు. 90 దశకంలోనే తెలంగాణ భావజాలం బలపడిందని, యువతలో కోరిక బలంగా కనిపించడాన్ని తాను గ్రహించినట్లు చెప్పారు. ఇదే మార్పుకు సంకేతంగా భావించినట్లు తెలిపారు. అటువంటి మార్పు కోసమే 2014లో జనసేన ప్రారంభించానన్నారు. తృతీయ పక్షం లేకుంటే ఉన్న రెండు రాజకీయ పక్షాలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉన్నందున మధ్యే మార్గంగా జనసేన ఆవిర్భవించిందన్నారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని భావించి అప్పటి నుండి దేశ, రాష్ట్ర సమకాలీన రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ వచ్చానన్నారు. వ్యక్తిగా బలపడటానికి రాలేదన్న ఆయన వ్యవస్థలను బలపరించేందుకే వచ్చినట్లు తెలిపారు. సీఎంగా పని చేయాలని జగన్...మళ్లీ తనను సీఎంని చేయమని చంద్రబాబు అడుగుతున్నారన్నారు. అధికారం కోసం అలోచించే వారే తప్పా ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉన్న నేతలు లేరన్నారు. రాజకీయం తనకు వ్యాపారం కాదని, రాజకీయాల్లో తాను డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏ మాత్రం లేదన్నారు. 2003 నుండే డబ్బు ప్రభావిత రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయన్నారు. అటువంటి సమయంలో వ్యవస్థను మార్చేందుకు చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారని, లక్ష్య ఛేదనలో పక్కన ఉన్న వారే ఆయనను నిరాశకు గురి చేశారన్నారు. అటువంటి స్థితి తరువాత జనసేనను స్థాపించి కోట్ల మంది జనం అభిమానం పొందుతున్నానన్నారు. స్వలాభం కోసం రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు శాసిస్తున్నాయన్నారు. ఏ జిల్లాలో చూసినా కుటుంబ ఆధిపత్య రాజకీయాలే కనిపిస్తున్నాయన్నారు. మనం ఎదుటి వారిని ప్రశ్నించాలంటే నైతిక బలం ఉండాలన్నారు. 2014లో పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని మొదట తాను భావించానని, కాని పార్టీ బలపడదన్న ఆలోచనతో పోటీకి దూరంగా ఉంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత జగన్‌లా చంపేయండి...చింపేయండి వంటి మాటలు తాను ఉపయోగించబోనన్నారు. ఎప్పుడు విమర్శలు చేసినా, సంస్కారవంతంగానే ఉంటాయన్నారు. జనసైనికులు కూడా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించాలన్నారు. మార్పు రాత్రికి రాత్రే సాధ్యం కాదన్నారు. ఓర్పు సహనంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానన్నారు. ఎంత ఒత్తిడినయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యువత రాజకీయ శక్తిగా మారడానికి సమయం పడుతుందని, వారిని రాజకీయ శక్తిగా మార్చే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆలోచనా శక్తి...వాస్తవిక దృక్పథంతో జనసైనికులు ముందుకు సాగాలన్నారు.
నాయకుల్ని నమ్మి పార్టీ స్థాపించలేదు..
తాను నాయకుల్ని నమ్మి పార్టీని స్థాపించలేదని, కేవలం అభిమానులు, సాధారణ కార్యకర్తలని నమ్మే జనసేనను స్థాపించినట్లు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. జనసైనికులతో బలమైన శక్తితో కూడిన సమూహంగా పార్టీ ఉందని, మనందరిలోని శక్తిని వ్యవస్థ రూపంలోనికి తీసుకురావలన్నారు. రాజకీయ ప్రస్థానంలో సహనం..ఓర్పు...పట్టుదల ముఖ్యమన్నారు. జగన్ తాను 30 ఏళ్లు సీఎంగా ఉండాలంటారు...బాబు మళ్లీ తానే సీఎం కావాలంటారు కానీ సీఎం అవ్వాలంటే మూడు తరాలు బాగుండాలన్న ఆకాంక్ష ఉండాలన్నారు. తన దగ్గర ఉన్నది బలమైన ఆశయం, అన్నదమ్ముల అండ మాత్రమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న పార్టీ కార్యకలాపాల కారణంగా పార్టీ బలంగా జనంలోనికి వెళ్లిన తరుణంలో ఇప్పుడు నిర్మాణాత్మకంగా కమిటీల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. అర్హులైన వారి వివరాలను సేకరిస్తున్నామని, అందరికీ అమోదయోగ్యమైన కమిటీల ఏర్పాటు తప్పకుండా జరుగుతుందన్నారు. స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ జనసేన ఒక్కటేనన్నారు. అభివృద్ధి చెందని కులాలను అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చెందిన కులాలని తిట్టనవసరం లేదన్నారు. సంకల్పబలం ఉంటే వెనుకబడిన కులాలని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లవచ్చన్నారు. ప్రతి కులంలోనూ మితిమీరిన కులాభిమానం ఉన్నట్లుగానే ఇతర కులాల పట్ల సహనంతో ఉండే వారు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. అటువంటి వారిని పార్టీలోకి ఆహ్వానించాలన్నారు. 2014లో టీడీపీకి మద్దతు తెలపడం అంటే సామాజికంగా ఒక ప్రయోగమేనన్నారు. ఆ ప్రయోగం విజయం సాధించినందువల్లే జనసేన ప్రజల్లోకి బలంగా దూసుకుపోయిందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుందన్నారు. కొత్తగా ఏర్పిడిన ఏపీ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి ముందుకు వెళ్లాలన్నా జనసేన పార్టీ రాష్ట్రానికి ఎంతో అవసరమని పవన్‌కళ్యాణ్ వివరించారు.